ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ టూర్ ఖరారు
29 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ టూర్
ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన ఖరారైంది. ఈనెల 29న ఇటలీకి బయలుదేరి వెళతారు. మొత్తం 5 రోజులపాటు విదేశాల్లో పర్యటించనున్న మోడీ. 16వ జీ-20 శిఖరాగ్ర సదస్సు… ఇటలీలోని రోమ్‌లో అక్టోబరు 30-31 తేదీల్లో జరగనుంది. ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీ ఆహ్వానం మేరకు ఆయన ఈ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. జీ-20 సభ్య దేశాల ప్రభుత్వాధినేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయంపై అంతర్జాతీయ సహకారం, ఆర్ధిక వ్యవస్థ, ఆహార భద్రత, సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పు తదితర అంశాలపై మాట్లాడనున్న ప్రధాని మోడీ. తదనంతరం నవంబరు 2 వరకు బ్రిటన్లలో పర్యటించనున్నారు.
ఇటలీలోని రోమ్‌లో పర్యటన తర్వాత మోడీ.. స్కాట్లాండ్ లోని గ్లాస్కోకు ప్రధాని మోడీ బయలుదేరి బ్రిటన్ వెళతారు. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా బ్రిటన్ ప్రధాని బోరీస్ జాన్సన్.. మోడీని ఆహ్వానించారు. అక్కడ ఈనెల 31 నుంచి నవంబర్ 12 వరకు జరగనున్న కాప్ -26 ప్రపంచ నేతల సదస్సుకు ఇటలీ, బ్రిటన్ అధ్యక్షత వహించనున్నాయి. 120 పైగా దేశాలకు చెందిన ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. నవంబర్ 1, 2వ తేదీల్లో జరిగే వరల్డ్ లీడర్స్ సమ్మిట్ (WSL)పేరుతో జరిగే ఈ సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఈ సదస్సు ప్రధాని నరేంద్ర మోడీ ఎనిమిదో జీ-20 సదస్సు కావడం విశేషం.
అంతేకాదు.. భారత్ తొలిసారిగా 2023లో జీ-20 సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. గత ఏడాది జరగాల్సిన కాప్-26 సదస్సు కరోనా కారణంగా వాయిదాలు పడి తాజాగా ఇప్పుడు జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా మూడు అంశాలపై చర్చించనున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రకటనలో విడుదల చేసింది.