ఐక్యరాజ్య సమితిలో మరోసారి ప్రధాని ప్రసంగం

ఐక్యరాజ్య సమితిలో మరోసారి ప్రధాని ప్రసంగం

ఐక్యరాజ్య సమితిలో మరోసారి ప్రధాని ప్రసంగం

భారత ప్రధాని నరేంద్ర మోడీ మరో అపూర్వ అవకాశం లభించింది. మరోసారి ఐక్యరాజ్య సమితిలో నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. ఇదే క్రమంలో సెప్టెంబర్‌ 25వ తేదీన ఐక్యరాజ్యసమితి అత్యున్నత జనరల్‌ అసెంబ్లీ సెషన్‌లో మాట్లాడనున్నారు. ఈ సమావేశం వర్చువల్ విధానంలో జరగనుంది. ప్రపంచ దేశాల్లో భారత్‌కు అగ్రభాగం లభిస్తోంది. ఈ క్రమంలోనే భారత ప్రధానిగా ఉన్న మోడీ ప్రసంగం కీలకం కానుంది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి వక్తల జాబితా సిద్ధం చేసింది. ఆ జాబితాలో భారత ప్రధాని పేరు తొలుతగా ఉండటం గర్వకారణంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్షోభం, వైద్యారోగ్య సేవల్లో కొరత ఏర్పడిన నేపథ్యంలోనే 76వ వార్షికోత్సవ సమావేశం రానుంది. ఈ సమావేశాల్లో తొలి రోజే ఉదయం ప్రధాని మోడీ ప్రసంగం ఉండడం విశేషం.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: