పూజగది ఏలా ఉండాలి.. ఏఏ విగ్రహాలు ఉండకూడదు..?

పూజగది ఏలా ఉండాలి.. ఏఏ విగ్రహాలు ఉండకూడదు..?

నిత్య పూజ అందరికీ ఎంతో శుభకరం

దీపారాధన అందరీ జీవితాల్లో వెలుగునిస్తుంది

దేవుడ్ని పూజించడం ద్వారా కోరికలు నెరవేరవేర్చుకోవచ్చు

మన భారతీయ సంప్రదాయం ప్రకారం పూజ గది అనేది..ప్రతి ఇంట్లో ఉంటుంది. మన దేశంలో కానీ ఏ దేశంలోనైనా హిందువు అనే ప్రతి ఒక్కరు డైలీ పూజ ఇంట్లోనే చేస్తూనే ఉంటారు. మన పూర్వీకులు అంటుంటారు..గుడిలేని ఊరు, బడిలేని ఊరు ఉండదని..అంటే దీని ప్రకారం చూస్తే ప్రతి ఇంట్లో పూజ గది లేని ఇల్లు ఉండదనే అనుకుందాం. అయితే మనం కోట్లు బెట్టి ఇల్లు కొన్నా పూజ గది అనేది ప్రతి ఒక్కరూ కేటాయిస్తుంటారు. ప్రతి ఇంట్లో వాస్తు ప్రకారం పూజా గదిని నిర్మిస్తుంటారు. మన ఇంట్లో పూజా గది వాస్తు ప్రకారం ఈసాన్య దిశ పూజ చేసుకోవడానికి అనువైన ప్రాంతంగా చెప్పొచ్చు. పూజా మందిరం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి. అయితే కర్మ సిద్ధాంతాన్ని నమ్మే ప్రతి ఒక్కరు పూజను ప్రొద్దున్నో లేక సాయంత్రమో పూజా మందిరంలో నిత్యం పూజ చేస్తుంటారు. అయితే ప్రతి ఒక్కరూ తమ స్తోమతను బట్టి దేవుడికి అలమారా కానీ, ఒక అరగానీ లేక మందిరాన్ని దానిలో దేవుడి పటాలను పెట్టి పూజిస్తుంటారు.  అయితే ఈసాన్యం గదిలో దక్షిణ, పశ్చిమగోడలో గల అలమరాలో దేవుడి పటాలను ఉంచి పూజించ వచ్చును. అయితే ఈసాన్యం గదిగా ఏర్పాటు చేయడం వీలుకాని పక్షంలో తూర్పు, పశ్చిమ, దక్షిణ వాయువ్యాలలో దేవుడి గదిని ఏర్పాటు చేసుకోవచ్చునని వాస్తు శాస్త్రం చెబుతోంది. అయితే నైరుతి, ఆగ్నేయ గదులలో మాత్రం దేవుడ్ని ఉంచి పూజ చేయరాదు.

పూజ గదిలో ఏఏ విగ్రహాలు ఉండకూడదు: మన ఇంట్లో పూజించే గదిలో వారికి ఇష్టమైన విగ్రహాలను పెట్టి పూజిస్తుంటారు. పండితులు చెప్పిన ప్రకారం ఏ విగ్రహాలను పెడితే ఆ విగ్రహాలను పెట్టరాదు. దీనికొక సంప్రదాయం ఉంది. అయితే మన పూజా మందిరంలో పంచముఖ ఆంజనేయ స్వామి, ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి, చేతిలో పిల్లన్నగ్రోవి ఉన్న కృష్ణుడి విగ్రహం, నటరాజ విగ్రహం, సూర్యుడి పటాలను ఉంచి పూజ చేయరాదు. అయితే  పూజ గదిలో పెద్ద విగ్రహాలను పెట్టి పూజ చేస్తే ఈ విగ్రహాలకు నిత్యం మహానివేదన చేయాల్సిందే..వారినికొక విగ్రహాలకు ఏదోఒక అభిషేకం చేయాల్సిందే.. లేనిచో ఆ ఇంటి యజమానిపై దుష్పప్రభావం పడే అవకాశం లేకపోలేదు. పండితులు తెలిపిన ప్రకారం చిన్న పరిణామంలో ఉన్న విగ్రహాలను పెట్టే మాత్రమే పూజించాలి.

పూజా రూమ్ ఏ విధంగా ఉండాలి: వాస్తు సిద్దాంతం ప్రకారం ఈసాన్యంలో  దేవుడి గది ఉంటే మంచిది. దేవుడ్ని దక్షిణ, పశ్చిమ నైరుతిలో పీట పెట్టి దేవుడి మందిరంలో కొత్త వస్త్రం వేసి దానిపై పటాలను ఉంచి పూజను ప్రారంభించుకోవచ్చును. అయితే వాస్తు ప్రకారం దక్షిణ, పశ్చిమ గోడలకు మాత్రమే దేవుడి పటాలను వేలాడదీయాలి. పండితులు తెలిపిన ప్రకారం నైరుతి, ఆగ్నేయ గదులను పూజా మందిరంగా చేయకండి.

పూజా విధానం: పూజ చేసేటప్పుడు వట్టి నేలపై కూర్చొని పూజ చేయకూడదు. పండితులు చెప్పిన ప్రకారం వస్త్రముకానీ, దర్భ చాప, తుంగ చాప, చెక్కపీట, ప్లాస్టిక్ పీటలైన వేసుకొని పూజ చేసుకోవచ్చును. మన శరీరానికి శుభ్రత ఎంత అవసరమో మనం పూజించే దేవుడి గదిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొవాలి. ప్రతి ఇంట్లో నిత్య దీపారధన ఎంతో శుభకరం అని శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. దేవుడి గదిలో క్రితం రోజు చేసిన పూలు, పూల దండలు, అగరబత్తుల పుల్లలు, ప్లాస్టిక్ కాగితాలు ఏమైనా ఉంటే శుభ్రం చేసుకోవాలి. పూజా విధానంలో భాగంగా ప్రతి రోజు భగవంతునికి ఏదోఒక నైవేద్యం నివేదించాలి. చేతకాని వారు కనీసం పటికబెల్లం, బెల్లం అయినా దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. ప్రతి పండుగకి వారి స్థోమతను బట్టి క్షీరాన్నం లేక పులిహార, దద్దొజనంతో పాటు వీలుగా ఉండే ఆహార పదార్ధాలను నివేదించడం ద్వారా భగవంతుణ్ని మనం ప్రసన్నం చేసుకోవచ్చు. ఇది మనకు ఏన్నో ఏండ్లుగా హిందూ సంప్రదాయంలో వస్తున్న ఆచారాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *