అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ @ పవర్ స్టార్..

అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ @ పవర్ స్టార్..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా కాంబో తాజా అప్ డేట్ వచ్చింది. డైరెక్టర్ సాగర్ కె. చంద్ర డైరెక్షన్ లో మలయాళ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియమ్’కు రీమేక్‌గా ఓ మూవీ రూపొందుతున్నది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ కథనం సోషల్ మీడియాలో హల్ ఛల్ చేస్తోంది. అయితే ఈ చిత్రానికి త్రివ్రికమ్ కథ, స్త్రీన్ ప్లే అందిస్తున్నారు.
అయితే ఆగస్ట్ 15న పవన్ కల్యాణ్ తన అభిమానులకు, ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారని చిత్రం యూనిట్ తెలిపింది. ఈ చిత్రం టైటిల్, కథ యొక్క ప్రాధాన్యతను తెలుపనున్నారు. ఈ చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
‘‘టైటిల్, ఫస్ట్ పోస్టర్ తో పవర్ స్టార్ సినిమా రాబోతుంది. ఈ మేరకు చిత్రబృందం ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. పవన్ కల్యాణ్ లుంగీతో దర్శనమిచ్చారు. ఇందులో పవన్ కల్యాణ్ భీమ్లానాయక్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. పవన్‌కు జోడీగా నిత్యామీనన్ నటిస్తోంది.
ఈసారి మామూలుగా ఉండదు మరి, పూనకాలే’’ అంటూ ప్రొడ్యూసర్ నాగవంశీ ట్వీట్ చేశారు. సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతున్న. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరక్టర్ తమన్ స్వరాలు అందిస్తున్నారు.
ఈసారి మాములుగా ఉండదు మరి, పూనకాలే 🔥🌪#BheemlaNayak @PawanKalyan pic.twitter.com/y4GADkFCFo
— PawanKalyan Team™ (@PawanKalyanTM) August 13, 2021