పవర్ స్టార్ “హరి హర వీరమల్లు” అదుర్సు ..!

పవర్ స్టార్ “హరి హర వీరమల్లు” అదుర్సు ..!

పవర్ స్టార్ “హరి హర వీరమల్లు” అదుర్సు ..!

పవర్ స్టార్ అభిమానులకు మరో సర్ ప్రైజ్ రానే వచ్చింది. అయితే తొలుతగా “హరిహర వీరమల్లు”ను ప్రారంభించారు. అయితే ఈ సినిమా బడ్జెట్, కరోనా వంటి కారణాలతో ఆగిపోయిందని  సమాచారం. ఈ సినిమా డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న పవర్ స్టార్, క్రిష్ “హరిహర వీరమల్లు”ను పూర్తి చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగం పూర్తయ్యిందని త్వరలోనే ఈ సినిమాను మళ్లా షూటింగ్ మొదలు పెడతామని తెలిపింది చిత్రయూనిట్.

అయితే ఈ మధ్యలోనే “భీమ్లా నాయక్” సినిమాకు పవన్ సైన్ చేసిన సంగతి తెలిసిందే. కె.సాగర్ కే చంద్ర దర్శకత్వంలో “భీమ్లా నాయక్” సినిమాకు ఓకే చెప్పి సినిమా షూటింగ్ మొదలు పెట్టేశాడు పవన్. భీమ్లా నాయక్ షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందని సమాచారం.

పవర్ స్టార్ 50వ పుట్టినరోజుని పురస్కరించుకుని మేకర్స్ అభిమానులకు చిత్రబృందం ఈ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసింది. ఈ పోస్టర్ లో “ఎల్లప్పుడూ సమాజం గురించి ఆలోచించేవారు… నిజమైన హీరో అని.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం గౌరవంగా ఉంది” అంటూ క్రిష్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

అయితే ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా 2022 ఏప్రిల్‌ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి క్రిష్‌ డైరెక్షన్ చేస్తున్నారు. ఇందులో పవన్‌ వజ్రాలదొంగ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ భారీ పీరియాడికల్ చిత్రానికి ‘హరిహర వీరమల్లు’కు మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఎమ్.రత్నం స్వరాలు అందిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలు పోషించనున్నారు. ఔరంగజేబు పాత్రలో అర్జున్ పాత్ర ఉంటుందని, జాక్వెలిన్ మొఘల్ రాణిగా నటిస్తున్నారట.

ఈ చిత్రంలో పవన్ తో కలిసి నిధి అగర్వాల్ హీరోయిన్ గా కనిపించబోతోంది. అయితే ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం మరియు హిందీ భాషల్లో కూడా సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మెగా సూర్య ప్రొడెక్షన్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య తెరకెక్కనుంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *