భీమ్లా నాయక్ గా…. పవర్ స్టార్ ఎంట్రీ

భీమ్లా నాయక్ గా…. పవర్ స్టార్ ఎంట్రీ

పవర్ స్టార్… భీమ్లా నాయక్ ఎంట్రీ

జనవరి 12 న ఈ చిత్రం రిలీజ్

సెప్టెంబర్ 2న సాంగ్స్

సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవర్ స్టార్ సినిమా.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులు, ఫ్యాన్స్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ సర్ ప్రైజ్ ఇచ్చాడు, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌-రానా దగ్గుబాటి నటిస్తున్న మల్టీస్టారర్‌ మూవీ అప్‌డేట్‌ వచ్చేసింది.  మూవీ టైటిల్‌పై ఇప్పటి వరకు వచ్చిన పుకార్లకు పుల్‌స్టాప్‌ పెడుతూ మేకర్స్‌ చిత్ర బృందం టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు మల్టిస్టారర్‌కు ‘భీమ్లా నాయక్‌’ అనే పేరును ఖరారు చేసి ఫస్ట్‌ గ్లింప్స్‌ వీడియోను విడుదల చేశారు. ఈ చిత్రం జనవరి 12 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 2న సాంగ్స్ రాబోతున్నాయి.

ఈ సినిమాలో ఫస్ట్‌ సీన్స్ లో ‘ఒరేయ్‌ డేనీ.. బయటకు రారా’ అంటూ పవన్‌ ఫైట్‌తో స్టార్ట్‌ కాగా.. లుంగి, బ్లాక్‌ షర్ట్‌తో ఇచ్చిన పవన్‌ ఎంట్రీ అభిమానుల చేత కేక పెట్టించేలా ఉంది. ‘డేని.. డేనియల్‌ శేఖర్‌’ అని రానా తన పేరు చెప్పగానే.. ‘భీమ్లా..భీమ్లా నాయక్‌.. ఏంటి చూస్తున్నావ్‌.. కింద క్యాప్షన్‌ లేదనా!! అక్కర్లేదు బండెక్కు’ అంటూ పవర్‌స్టార్‌ వేసిన డైలాగ్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.

కాగా మలయాళంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, బీజుమేనన్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ మూవీకి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అక్కడ ఈ మూవీ సూపర్‌హిట్‌ అందుకుంది..

ఈ సినిమాను తెలుగులో పవన్‌కల్యాణ్‌ “ భీమ్లానాయక్‌”  అనే పోలీస్‌ పాత్రలో కనిపించనున్నాడు.  బీజుమేనన్‌ పోషించిన పాత్రను తెలుగులో పవన్‌, పృథ్వీరాజ్‌కుమార్‌ పోషించిన పాత్రలో “ రానా” కనిపించనున్నాడు. ఈ సినిమాలో  నిత్యామీనన్‌, ఐశ్వర్యా రాజేశ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ చిత్రం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ స్వరాలు  అందిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *