ప్రభాస్ 25వ సినిమా వచ్చేసింది..టైటిల్ పేరెంటో తెలుసా..?

యంగ్ ప్రభాస్ 25వ సినిమా వచ్చేసింది..టైటిల్ పేరెంటో తెలుసా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 25వ సినిమా పేరు ఖరారైంది. ఈ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ ఖరారు చేశారు. పాన్ ఇండియన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయబోతున్నారు. టి.సిరీస్ భద్రకాళీ పిక్చర్స్ ఈ సినిమా తీయబోతున్నాయి. అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి, అదే సినిమాను హీందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి సంచలనం సృష్టించారు.

ఇక వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. ఇప్పటికే రాధేశ్యామ్ మూవీ పూర్తి చేసిన సంగతి అభిమానులకు తెలిసిందే. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా షూటింగ్, బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ డైరెక్షన్ రాబోతున్న ఆదిపురుష్ షూటింగ్ లోనూ బిజీగా ఉన్న డార్లింగ్. ఇంకో విశేషమేమిటంటే ప్రభాస్ చేస్తున్న అన్ని చిత్రాలు కూడా పాన్ ఇండియా లెవలో ఉండడం మరో అద్భుతం.

మరో ప్రక్క ప్రభాస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ సినిమా చేయనున్నాడు. నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి.  సలార్ సినిమా, ఆదిపురుష్ సినిమాల తర్వాత ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా తెరక్కెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తామని దర్శక నిర్మాతలు తెలియజేశారు.

ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, చైనీస్‌, కొరియన్‌, జపాన్‌ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *