మా సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్ రాజీనామా

మా సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్ రాజీనామా

‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకాశ్‌రాజ్‌ ప్రకటించారు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడుతూ తెలుగువాడిగా పుట్టకపోవడం తన దురదృష్టకరమన్నారు. నా తల్లిదండ్రులు తెలుగు వాళ్ళు కాదు. అది నా తప్పు కాదు, వాళ్ళ తప్పు. అతిథిగా వచ్చానని, అతిథిగానే ఉంటానని ప్రకటించారు. తెలుగు బిడ్డనే ‘మా’ అధ్యక్షుడుగా కావాలనుకున్నారు. కానీ నాకు కళాకారుడుగా ఆత్మ గౌరవం ఉంది. ప్రాంతీయత ఆధారంగానే ఎన్నికలు జరిగాయని ప్రకాశ్ రాజ్ అన్నారు.

‘మా’ మెంబర్ అయి “21 ఏళ్ళు అయింది. ‘మా’ కుటుంబంలో అందరూ ఒక్కటే అనే పదం అబద్ధం. ఓటమి జీర్ణించుకున్నా, అందుకే ఈ నిర్ణయం. ఇకపై మాలో భాగస్వామ్యంగా ఉండలేను” అంటూ ‘మా’ కార్డు చూపించారు. ఇక అసోసియేషన్ నుంచే బయటికి వచ్చాను కానీ తెలుగు సినిమా నుంచి బయటకు రాలేదు. సినిమాలు చేస్తూనే ఉంటాను. సభ్యులతో కలిసి నటిస్తాను. వారికి ఏం కావాలన్నా చేస్తాను. రాజీనామా నిర్ణయం బాధతో తీసుకున్నది కాదని తెలిపారు. ఇది బాధతో తీసుకున్న నిర్ణయం కాదు.

ఇక ‘మా’ ఎన్నికలు సజావుగా సాగాయని, ఎన్నికల్లో ఈసారి ఎక్కువ మంది చైతన్యంతో ఓటు హక్కు వినియోగించుకున్నారని ఆయన అన్నారు. ఈసారి మా ఎన్నికల్లో దాదాపు 650మంది పాల్గొన్నారు. మంచు విష్ణు ఇచ్చిన హామీలను త్వరలోనే నెరవేర్చాలని కోరారు. మంచు విష్ణు గెలుపును స్వాగతిస్తున్నట్లు ప్రకాశ్‌రాజ్‌ తెలిపారు.

మంచు విష్ణు, శివబాలాజీ రఘుబాబుతో సహా గెలిచిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. మా ఎన్నికల్లో పెద్ద అజెండాతో మంచు విష్ణు ప్యానెల్ ప్రణాళికతో ముందుకొచ్చారు. మీరిచ్చిన హామీలు నెరవేర్చండి.

పెద్ద నటులు మోహన్‌బాబుగారు, కోటగారు, చలపతిరావు తనయుడు రవి వీళ్లంతా ‘అతిథిగా వస్తే, అతిథిగానే ఉండాలి’ అని చెప్పారు. అలాగే ఉంటా. మీరు అనుకున్నది జరిగింది. ‘మా’ ఎన్నికల్లో జాతీయవాదం వచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లాంటి వాళ్లు ట్వీట్‌ చేశారు. ఎలా ఓడిపోయాం. ఎలా గెలిచాం అన్నది ముఖ్యం కాదు. ఎన్నికలు జరిగాయి. వాళ్లు గెలిచారు.

నాగబాబుగారి ఒక్క ఓటు వల్ల నేను గెలవలేను కదా!, ఏది చెప్పినా, ఎవరు చెప్పినా.. ‘మా’ సభ్యుల నిర్ణయమే అంతిమం కదా…‘మా’ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తీసుకున్న నిర్ణయం పట్ల నేనేమీ విచారపడటం లేదు. ‘మా’ సభ్యుల నిర్ణయాన్ని గౌరవిస్తా. నాకు ఓటు వేసిన వాళ్లకు ధన్యవాదాలు. అంటూ ప్రకాష్ చెప్పారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *