ఈ ఆకూరలతో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..!

ఈ ఆకూరలతో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..!

ఈ ఆకూరలతో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..!

మనదేశంలో అనేక రకాల ఆకుకూరలు సమృద్ధిగా పండుతాయి. ప్రాంతాల వారీగా కొన్ని ప్రదేశాల్లో కొన్ని పంటలు సమృద్ధిగా పండుతాయి. దీనిలో భాగంగా మన రైతులు ఎక్కువగా ఆకు కూరలు సమృద్ధిగా పండిస్తారు. దీనిలో ఎక్కువగా పండే పంటలు గోంగూర, పాలకూర, తోటకూర, బచ్చలికూర, మెంతికూర, పుదీనా, పొన్నగంటి కూరతో పాటుగా ఎలా ఎన్నో కూరలు మనకు ప్రకృతిలో లభిస్తున్నాయి. ఆ ఆకూరలతో మన శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా ఆకుకూరలు మంచి పౌష్టికకరమైన ఆహారం. వీటిలో క్యాల్షియం, ఇనుము, విటమిన్‌ ‘ఎ’, ‘సి’, రైబోఫ్లెవిన్‌, ఫోలిక్‌యాసిడ్‌ మరియు పీచు ఎక్కువగా ఉంటుంది. మనకి ప్రకృతి ఇచ్చిన ఆరోగ్యవరాలలో ఆకు కూరలు చేసే అద్భుతాలెన్నో…. శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను ప్రోటీన్లను, అందిస్తుంటాయి.

బచ్చలి కూర:  బచ్చలికూరలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో ఎ, సి విటమిన్లు ఉండంటం వల్ల రోగ నిరోధక శక్తి లభిస్తుంది. ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయ పడుతుంది. బచ్చలి కూరలో మెగ్నీషియం, జింక్ పుష్కలంగా లభిస్తుంది.  ఎండాకాలంలో సహజంగానే శరీరం వేడిగా మారుతుంది. బచ్చలికూరను తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత చల్లబడుతుంది. కనుక వేసవిలో దీన్ని తప్పకుండా ఈ ఆకు కూర తీసుకోవడం వల్ల రక్తహీనత నుండి కాపాడుకోవచ్చు. బచ్చలి కూరలో వీర్యాభివృద్ధిని కలిగించే గుణాలున్నాయి. బచ్చలి కూర తీగ జాతికి చెందింది. దీనిని సులువుగా ఇళ్లలో పెంచుకోవచ్చు.

తొటకూర: ఈ కూరలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలుంటాయి. అందువల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ బారి నుండి కూడా మనం ఈ కూర తినడం వల్ల కాపాడుకోవచ్చు. సహజంగా దీనిని మన ఇళ్లలోనే పెంచుకోవచ్చు. ఇందులో అనేక పోషకాలు మనకు లభిస్తాయి. అందుకే అనారోగ్యాల బారిన పడ్డవారు రోజూ తోటకూరను తింటుంటే త్వరగా కోలుకుంటారు. తోట కూరను పచ్చం కూరగా వండుతారు. అంటే బాలింతరాలు ఎక్కువగా వాడతారు. ఈ కూర చాలా రుచికరంగా ఉంటుంది.

పాలకూర: ఈ ఆకు కూరలో చాలా తక్కువగా కెలరీలు ఉంటాయి. త్వరగా బరువు తగ్గాలను కునే వారు ఈ ఆకూరను తీసుకోండి. దీనిని రోజు ఉదయానే పరిగడపున జ్యూస్ గా తీసుకుంటే చాలా మంచింది. దీనిలో విటమిన్ A, విటమిన్ B6, విటమిన్ Cతో పాటుగా ఆంటి ఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి. శరీరంలో వాత, పిత్త, కఫ దోషాల్లో ఏర్పడే అసమతుల్యతల వల్లే మనకు అనేక అనారోగ్యాలు సంభవిస్తుంటాయి. అయితే పాలకూరను తీసుకుంటే ఆ మూడు దోషాలు సమతుల్యం అవుతాయి. దీంతో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఈ కూర జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మూత్ర పిండాలలో రాళ్లు, క్యాన్సర్, గుండెపోటు రాకుండా అనేక తీవ్రమైన జబ్జుల నుంచి కాపాడుతుంది.

గోంగూర: గోంగూర పచ్చడి అంటే తెలుగువారికి ఎంతో ప్రతీకరం. ఈ గోంగూరను చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దలు దాకా తెగలాగిస్తుంటారు. వారానికి ఒక్కసారైనా గోంగూర పప్పు, పచ్చడి చేసుకుని తింటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. గోంగూరను మటన్ లో కలిపి వండితే అధ్భుతంగా ఉంటుందటా.. గోంగూరలో విటమిన్ C, A, B6తో పాటుగా పొటాషియం, ఐరన్ లాంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ గోంగూర వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి రక్తపోటు అదుపులో ఉంటుంది. దీనిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. జీర్ణ సమస్యలు మెరుగు పడతాయి. గోంగూర వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది.  రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచి, చక్కెర శాతాన్ని తగ్గించే శక్తి గోంగూరకు ఉంది. ఈ గోంగూరను నిత్యం తీసుకోవడం వల్ల అనారోగ్యాల నుంచి కాపాడు కోవచ్చును. గోంగూర తినడం వల్ల గుండెకు బలం చేకూరుతుంది. దంత సమస్యలు, కడుపులో పురుగులు వంటి సమస్యలను తగ్గిస్తుంది.  రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచి షుగర్ లెవెల్స్ శక్తి గోంగూరకు ఉంది. ఇది కొన్ని అధ్యయానాల్లో తేలింది. దగ్గు, ఆయాసం, జలుబుతో బాధపడేవారు ఈ కూరను ఏదో రూపంలో తీసుకంటే తగ్గుతుంది.

కొత్తిమీర: కొత్తమీరను ఈజీగా ఇండ్లలో పెంచుకోవచ్చు. ఈ కూరలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్ బాగా ఉన్నాయి. ఇవి అనేక రకాల చర్మ సమస్యల నుండి కాపాడుకోవచ్చు. ఈ ఆకుల్లో ఉండే విటమిన్స్ నుంచి చర్మాన్ని మృదువుగా చేసుకోవచ్చు. కొత్తిమీర వల్ల ఆస్తమా సమస్యను దూరం చేసుకోవచ్చు. దీనిని నిత్యం తీసుకుంటే ఆస్తమా తగ్గుతుంది, అలాగే జీర్ణ సమస్యలు దరి చేరవు. ముఖ్యంగా హైబీతో బాధపడేవారు కొత్తమీర జ్యూస్ ను రోజు ఉదయం పరిగడుపున తీసుకుంటే తగ్గుతుంది. కొత్తమీరలో ఫైబర్ ఎక్కువగానే ఉంటుంది. జీర్ణ సమస్యలు, ఫ్రీ డైజేషన్ కూడా అవుతుంది. కొత్తిమీర వల్ల కంటి సమస్యల నుండి కాపాడుకోవచ్చు. కొత్తిమీరలో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్స్, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. దీంతో కంటి మీద ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇందులో ఉండే బీటా కెరొటిన్ ఉంటుంది. దీనివల్ల కండ్ల కలక రాకుండా సహాయకారిగా ఉంటుంది. వంటకాల్లో దీనిని అధికంగా వాడతారు. దీని ఆ పదార్థాలు చాలా రుచిగా ఉంటాయి. నోరు దుర్వాసన వచ్చే వారు కొత్తమీరను నిత్యం తీసుకుంటే మంచిది.

పుదీనా: అద్భుతమైన సువాసనలు వచ్చే వాటిల్లో పుదీనా ఒకటి. దీనిని వంటకాలలో అధికంగా వాడతారు. పుదీనా ఆకులు తక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయని, చాలా తక్కువ మొత్తంలో కొవ్వులు, ప్రొటీన్లు ఉంటాయని నిపుణులు వివరించారు. పుదీనాలో విటమిన్ A, విటమిన్ C తోపాటుగా బికాంప్లెక్స్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా మౌత్ ఫ్రెషనర్స్ లో పుదీనాను ఎక్కువగా ఉపయోగిస్తారు. కాస్మోటిక్ లలో ఎక్కువగా వాడతారు. పుదీనా ఆకుల రసాన్ని క్రీములు, ఔషధాల తయారీలో బాగా వాడతారు. పాలీ ఫినాల్స్‌కు పుదీనా గొప్ప వనరు లాంటిది. పుదీనాలో కార్మినేటివ్, యాంటీస్పాస్మోడిక్ లక్షణాలు ఉన్నాయి. కనుకనే దీన్ని వివిధ రకాల టూత్ పేస్ట్, చూయింగ్ గమ్స్, క్యాండీస్ మరియు ఇన్ హేలర్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కారణం పుదీనా ఆకులు శరీరంను కూల్ గా ఉంచుతాయి. రక్తం శుద్ధి చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిని నేరుగా నమిలి తినవచ్చు. దీని వల్ల నోటి సమస్యలు,జీర్ణ సమస్యలు తగ్గుతాయి. పుదీనాలో మెంథాల్ ఉండటం వల్ల శరీర కండరాల్ని రిలాక్స్ చేస్తుంది. పుదీనాతో తయారుచేసిన ఆయిల్‌ సువాసనను పీల్చడం వల్ల మెదడులో సెరోటోనిన్ అనే రసాయనం విడుదలవుతుంది. ఇది శరీరంలోని ఒత్తిడి, నిరాశను తగ్గించడంలో సహాయపడుతుంది.

మెంతికూర: ముఖ్యంగా ఆహార పదర్ధాలలో మెంతి కూరను విరివిగా వాడతారు. ముఖ్యంగా ఇది మధుమేహంతో బాధపడేవారికి చాలా ఉపయోగపడుతుంది. చలికాంలో దీనిని ఎక్కువగా తీసుకోడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. మెంతి కూరలో విటమిన్-C, B1, B2, కాల్షియం ఉంటుంది. దీనిలో అతితక్కువ కేలరీలు ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మెంతి కూరతో ఈజీగా స్థూలకాయంతో పాటుగా బరువు తగ్గొచ్చు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తో పాటుగా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. దీనిని తినడంవల్ల ముత్రాశయంలోని రాళ్లు కరిగిపోతాయి. దీని నుంచి ఎన్నోరకాల విటమిన్లు లభిస్తాయి. మెంతి కూర తినడం వల్ల బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది.

పొన్నగంటి కూర: ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. కంటి కింద నల్లటి వలయాల నుంచి కాపాడుకోవచ్చు. పొన్నగంటి ఆకును ఉడికించుకుని అందులో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చేర్చి తీసుకుంటే చాలా మంచిది. మెదడు పనితీరుతో పాటుగా నోటి దుర్వాసన పోతుంది. మెరుగుపరుస్తుంది. అధిక బరువు తగ్గాలనుకునే వారు పొన్నగంటి ఆకు, కందిపప్పు బాగా ఉడికించుకుని అందులో కొద్దిగా నెయ్యి, ఉప్పు, పచ్చిమిర్చి, చింతపండు వేసి మరికాసేపు ఉడికించి సేవిస్తే నెలరోజుల్లో స్లిమ్‌గా మారుతారు. కడుపులో ఉన్న తల వెంట్రుకలను కూడా మటుమాయం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీనిని ఆయుర్వేదంలో ఆరోగ్య ప్రదాయునిగా చూస్తారు. మనం నిత్యం పీల్చే గాలో రసాయనాలుంటాయి. పొన్నగంటి కూర తినడం వల్ల వాటి బారి నుంచి కాపాడుకోవచ్చును.

కరివేపాకు: ఈ ఆకులలో బయోటిన్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల జుట్టు సంరక్షణ తో బాటుగా అరుగుదల జరుగుతుంది. రోజుకు పది కరివేపాకు చెట్టు ఆకులను పరగడుపున తింటే డయాబెటిస్‌ను అదుపు చేయడంలో ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా మధుమేహ నియంత్రణకు, కంటి చూపు మెరుగుపడడానికి ఎంతగానో మేలు చేస్తుంది. అంతేకాకుండా కరివేపాకు పొడి చేసుకొని ఆహారంలో తింటే చాలా బాగుటుంది.

చింత చిగురు: వేసవిలో చింత చిగురు బాగా కాస్తుంది. చింతచిగురు పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేసి కాలేయానికి పుష్టినిస్తుంది. ఇది పైత్యం, వికారాలు నివారిస్తుంది. అంతేకాకుండా ఆయుర్వేదంలో పచ్చకామెర్లకు చింతచిగురు ఔషధంగా వాడతారు.

సునాముఖి: ఈ ఆకులను సాధారణంగా వంటకాలలో సుగంధ ద్రవ్యంగా వాడతారు. బిర్యాని వంటకాలలో బాగా దీనిని వాడతారు. వివిధ రకాల క్యాన్సర్ వ్యాధులను నివారించడంలోనూ ఈ ఆకు కీలకంగా పనిచేస్తుంది. గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. ఈ ఆకులను రసంలో వేసి వండుకొని సేవిస్తే మలబద్ధకంతో సహా గ్యాస్ సమస్యలు వంటి వాటిని దూరం చేసుకోవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్ లు విటమిన్ C బిర్యానీ ఆకులో పుష్కలంగా ఉంటాయి. ఈ బిర్యానీ ఆకు వంటలకు మంచి రుచి ఇవ్వడంతో పాటు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ ఆకులు క్రమంగా శరీరంలో, మనసులో ప్రశాంతత, డిప్రెషన్ లక్షణాలను అడ్డుకోవడంలో సహాయపడతాయి. DL లేదా చెడు కొలెస్ట్రాల్‌ను మరింత తొలగిస్తాయి.

ఆకుకూరలు మంచివేనా..? తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయా?
ఆకుకూరల గురించి చాలా మందికి సందేహాలు ఉంటాయి. ఆకుకూరల్లో ముఖ్యంగా పాలకూర తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయని అంటుంటారు. నిజానికి పాలకూర, టమాటా కలిపి వస్తాయని అంటారు. కానీ పాలకూర తింటే కిడ్నీలో రాళ్లు రావు.  రాళ్లు వచ్చే అవకాశం ఉన్నవారిలో ఒక్సాలేట్స్‌  ప్రభావంతో రాళ్లు ఏర్పడతాయి. ఈ ప్రభావం ఉన్నవారిలో నీటి మోతాదును సరిగా తీసుకోకపోతే రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువ. దీంతో పాటుగా ఎండలో బాగా తిరిగే వారికి కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువ. ఇలాంటి వారు వీలైనంత వరకు ఎక్కువ నీళ్లు తాగాలి. ఆహారంలో ద్రవ పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

ఆకుకూరల్లో ఉన్న పోషకాలు పూర్తిగా శరీరానికి అందాలంటే వాటిని వండే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఆకుకూరలను కట్‌ చేయకముందే ఐదు నిమిషాల పాటు ఉప్పు నీటిలో ఉంచాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటిలో మూడుసార్లు కడగాలి. దీని వల్ల ఆకుకూరలపై ఉన్న రసాయన అవశేషాలన్నీ తొలగిపోతాయి. ఆ తర్వాత కట్‌ చేయాలి. ఆకుకూరలు వండేటప్పుడు నీళ్లు పోయవద్దు. అందులో ఉన్న నీటితోనే కూర మగ్గుతుంది. ఇలా వండుకున్న ఆకుకూరల్లో అన్ని పోషకాలు ఉంటాయి. ఉడికించి నీళ్లు పారబోస్తే చాలా విటమిన్లు పోతాయి. తద్వారా మన శరీరానికి అందాల్సిన పోషకాలు అందండం కష్టమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *