ప్రముఖ కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కన్నుమూత

కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కొడుకు పునీత్ రాజ్ కుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం వ్యాయామం చేస్తుండగా పునీత్ రాజ్ కుమార్ కు హార్ట్ ఎటాక్ వచ్చింది. హుటాహుటిన ఆయని విక్రమ్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా పునీత్ ను కాపాడలేకపోయారు. ఆయన వయసు 46 ఏళ్లు. పునీత్ కు ఇద్దరు పిల్లలు.

పునీత్ మరణవార్తతో కన్నడ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు పునీత్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పునీత్ రాజ్ కుమార్ మృతి కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు..ఇప్పటికే కర్ణాటకలో థియేటర్స్ మూతపడ్డాయి.

పునీత్‌ చనిపోయాడన్న విషయం తెలుసుకున్న సినీ పెద్దలు.. ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రి నుంచి డేడ్‌బాడీని బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి తరలించారు. పునీత్‌ మృతిపై కన్నడ సీని ప్రముఖులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతిపై పలువురు సినీ పెద్దలు, ప్రముఖులు ట్వీట్‌లు చేశారు. ట్విట్టర్‌ ద్వారా తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

పునీత్ రాజ్ కుమార్ గురించి:

కన్నడ నాట శాండిల్ వుడ్ పవర్ స్టార్, అభిమానులంతా “అప్పు” అని ముద్దుగా పిలుచుకునే వారు. పునీత్ రాజ్ కుమార్ మృతి పట్ల చిత్రసీమకు కోలుకోలేని దెబ్బ. కన్నడ సినీ ప్రేక్షకుల దైవం రాజ్ కుమార్ చిన్నకొడుకు పునీత్ రాజ్ కుమార్. తండ్రి వారసత్వాన్ని నిలబెట్టే కొడుకుగా.. చిన్నప్పట్నుంచే సినిమాల్లో పునీత్ రాజ్ నటించారు.

కన్నడ చిత్రపరిశ్రమలో బెస్ట్ ఛైల్డ్ ఆర్టిస్ట్ గా జాతీయ అవార్డ్ అందుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ నుండి హీరోగా ఎదిగారు. కన్నడ సినీప్రేక్షకులతో పవర్ స్టార్ అనిపించుకున్నారు. కన్నడనాట అత్యథికంగా సక్సెస్ రేట్ కలిగిన హీరోల్లో పునీత్ ఒకరు.

బాలనటుడిగా, హీరోగా, నిర్మాతగా, గాయకుడిగా, టీవీ ప్రజెంటర్ గా.. ఇలా ఎన్నో అవతారాల్లో మెప్పించారు పునీత్. ఇటు టాలీవుడ్ తో కూడా మంచి సత్సబంధాలు కలిగి ఉన్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కు పునీత్ చాలా దగ్గరయ్యాడు. పునీత్ నటించిన ఓ సినిమాలో ఎన్టీఆర్ పాట కూడా పాడాడు. ఇటీవల ఆయన నటించిన యువరత్న సినిమా రిలీజ్ అయింది. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలలో నటిస్తున్నారు. ఆ చిత్రాలు చివరి అంకాన్ని చేరుకున్నాయి. అంతలోనే చిత్రసీమను విడిచి ఇలా హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచి పునీత్ వెళతారని ఊహించలేదు సినీ లోకం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *