డ్రగ్స్ కేసులో ఈడీ ఎదుట హాజరైన డైరెక్టర్ పూరీ జగన్నాథ్

డ్రగ్స్ కేసులో ఈడీ ఎదుట హాజరైన డైరెక్టర్ పూరీ జగన్నాథ్
మాదక ద్రవ్యాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా (మంగళవారం) టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ED ఎదుట హాజరయ్యారు. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. వరుసగా సినీ హీరోయిన్లు చార్మి, రకుల్ ప్రీత్‌సింగ్, ముమైత్‌ఖాన్..సినీ నటులు నవదీప్, రవితేజ, రానా, తనీష్, నందు, తరుణ్‌ను కూడా ఈడీ విచారించనుంది.
ఈ డ్రగ్స్ కేసును విచారించేందుకు ఆఫీసర్ శ్రీనివాస్ ని నియమించింది. అయితే ఈ నివేదికను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ఆఫీసర్ శ్రీనివాస్ నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం కెల్విన్‌తో పాటు మరో ఏడుగురు నిందితుల వివరాలను తీసుకుందని సమాచారం. 12 మంది సెలబ్రెటీలు సహా మొత్తం 50 మందిని సిట్ విచారించి వారి నుంచి సమాచారాన్ని రాబట్టింది. దీనిలో భాగంగా కేసును మరింత వేగవంతం చేస్తోంది.