పుష్పలో ఐటెమ్ సాంగ్ లో ఓ బేబి.. ఓ బేబి
తనకంటూ ఇండస్ట్రీలో ఓ పేరు తెచ్చుకున్న సమంత..నాగచైతన్యను పెళ్లి చేసుకున్న అనంతరం వారివురి కాపురం మూడ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. విడాకుల అనంతరం హీరోయిన్ సమంత మళ్లీ జోరు పెంచుతోంది. నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత సమంత సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకునేది. మంచి పాత్రలను మాత్రమే అంగీకరించేది. రాజుగారి గది-2, ఓ బేబీ, మజిలీ వంటి సినిమాలలో సమంత క్యారెక్టర్ చాలా సున్నితంగా, మనసుకు హత్తుకునేలా ఆమె నటన ఉంది.
అయితే ఆమె సినిమాలతో బిజిగా ఉండేందుకు మళ్లీ పాత పద్దతిలోకి వెళ్లి కమర్షియల్‌గా ఐటమ్ సాంగులకు సైతం ఓకే చెప్పిందని సమాచారం. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ సినిమాలో ఓ ఐటెం సాంగ్ కోసం సమంతను సంప్రదించగా ఆమె ఓకే చెప్పేసినట్లు ఫిల్మిం నగర్ లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
నాగ చైతన్యతో వివాహానికి ముందు పలు సినిమాల్లో సమంత గ్లామరస్ రోల్స్, ఐటమ్ సాంగ్స్ చేసిన సందర్భాలు లేకపోలేదు. అయితే చైతూ నుంచి విడిపోయిన తర్వాత సమంత మళ్లీ కమర్షియల్ జోన్లోకి అడుగెడుతోంది. ఇందులో భాగంగానే ‘పుష్ప’లో ఐటెం సాంగ్‌కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా ఈ సాంగ్ చిత్రీకరణ కోసం సెట్ వేస్తున్నారు. అయితే ఈ సినిమాలో సమంతను కొత్త లుక్ లో కనిపించబోతుందట. పుష్ప మూవీలో బన్నీతో కలిసి ఐటమ్ సాంగ్ చేయబోతోంది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తుడగా..క్రిస్మస్ కానుకగా.. ఈ సినిమాకు అన్నీ క్లియర్ అయితే డిసెంబర్ 17న ‘పుష్ప పార్ట్-1’ విడుదల కానుంది. ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇందులో ఐకాన్ స్టార్ బన్నీ పుష్పరాజ్ అనే ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన ప్రేయసి శ్రీవల్లిగా రష్మిక కనిపించనుంది. విలన్‌గా మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు, గ్లింప్స్ భారీగా అంచనాలు పెంచాయి.