‘పుష్ప’ లో పోలీస్ వచ్చేశాడు..

‘పుష్ప’ లో పోలీస్ వచ్చేశాడు..
బన్నీ అభిమానులంతా ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూసే సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘పుష్ప’ ఒకటి. ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన ఈ చిత్రం త్వరలో తెరకెక్కుతోంది. అయితే మలయాళీలో తనకంటూ ఓ పేరు తెచ్చుకున్న విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్..ఇందులో బన్నిని ప్రతి ఘటించే పాత్రలో కనిపించనున్నారు. చిత్ర బృందం ఆయన పోస్టర్ ను విడుల చేసింది. అభిమానులను, ప్రేక్షకులను అలరించేందుకు ఫహద్ లుక్‌ను చిత్రబృందం నెటిజన్లకు పరిచయం చేసింది. ‘విలన్‌ఆఫ్‌పుష్ప’ పేరుతో ఫహద్ ఫస్ట్‌లుక్‌ను షేర్ చేసింది. పోస్టర్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీస్ అధికారిగా.. కంటిచూపుతోనే అందర్నీ గజగజ వణికించేలా పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపించుచున్నారు.
సుకుమార్ డైరెక్షన్ లో తీస్తున్న చిత్రమిది.. బన్నీ సరసన రష్మిక నటిస్తోంది. అయితే ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న కథాంశంగా తెరకెక్కుతున్న భారీ చిత్రమిది. ఇందులో ఐకాన్ స్టార్ ఎర్రచందనం స్మగ్లర్‌గా పుష్పరాజ్ పాత్రలో కనిపించనున్నారు. మైత్రిమూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే స్టోరీ పెద్దది కావడంతో రెండు భాగాలుగా తీసారట. అయితే ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించనుంది. ఈ చిత్రాన్ని ‘పుష్ప ది రైజ్’ పేరుతో తొలి భాగాన్ని ఈ ఏడాది క్రిస్మస్ కల్లా బన్నీ అభిమానులు, ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు తెగ ప్రయాత్నాలు చేస్తోందట. బన్నీ-సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది.