పీవీ సింధూని సత్కరించిన మెగాస్టార్

పీవీ సింధూని సత్కరించిన మెగాస్టార్

తన నివాసంలో పీవీ సింధూని సత్కరించిన మెగాస్టార్

ప్రపంచదేశాల్లో పతాకాలు అందుకొని ఇండియాకు వన్నెతెచ్చిన తన నివాసానికి పిలిచి బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూనీ ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు…ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ దేశానికి రెండు సార్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది బ్యాడ్మింటన్ స్టార్ వీపీ సింధు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సింధును ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఇటీవల ప్రత్యేక వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన నాగార్జున, అల్లు అరవింద్, రానా, సీనియర్ డైరెక్టర్లు, సినీ నిర్మాతలు, సీనియర్ హీరోయిన్లు రాధిక, సుహాసినితో సహా చిరంజీవి కుటుంబసభ్యులు, ఆత్మీయులు, పలువురు సినీ ప్రముఖులు హాజరై సింధును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పీవీ సింధు దేశానికి రెండు సార్లు పతాకాలను సాధించి ప్రపంచస్థాయిలో ఇండియాకు పేరు తెచ్చిందని..
చిరంజీవి కొనియాడారు. పీవీ సింధును చూసి దేశ మంతా  మురిసిపోతుంటే తన బిడ్డే అన్న భావన కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు.

చిరంజీవి కుటుంబం తనపై చూపించిన ప్రేమానారాగాల్ని, గౌరవాన్ని ఎప్పటికి మర్చిపోనని అన్నసింధు..  వచ్చే ఒలింపిక్స్‌లో తప్పకుండా బంగారు పతకాన్ని సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. పీవీ సింధు సాధించిన కాంస్య పతకంతో ప్రత్యేకంగా ఫొటోలు దిగుతూ సినిమాస్టార్లు సందడి చేశారు. అమ్మవారి విగ్రహాన్ని బహుకరించి పీవీ సింధుకి ఆశీర్వదించారు. ఈ సన్నివేశాలకు సంబంధించిన వీడియోను చిరంజీవి.. సామాజిక మాధ్యమం ద్వారా మెగా అభిమానులతో పంచుకున్నారు. ప్రేక్షుకులు, అభిమానులు ఆద్యంతం అలరించేలా, నవ్వులు పంచేలా సాగిన ఆ వీడియోను మీరూ చూసి ఎంజాయ్ చేయండి.

https://www.instagram.com/tv/CTHk2W1DMdi/?utm_source=ig_web_button_share_sheet

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *