రాధేశ్యామ్ రొమాంటిక్ పిక్ విడుదల

రాధేశ్యామ్ రొమాంటిక్ పిక్ విడుదల

రాధేశ్యామ్ రొమాంటిక్ పిక్ విడుదల

జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న చిత్రం రాధేశ్యామ్.. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని రాధేశ్యామ్ నుంచి మూవీ మేకర్స్ సినీ ప్రేక్షకులకు ఒక్కసారిగా సర్ ప్రైజింగ్ పోస్టర్నీ రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయ్యనున్నట్లు తొలుత ప్రకటించారు. ఆ తరువాత 2022, జనవరి 14న న్యూఇయర్..న్యూ బిగినింగ్స్.. అండ్ ఎ న్యూ రిలీజ్ డేట్ అంటూ ప్రకటించారు. కరోనా ప్రభావంతో ఈ సినిమాని విడుదల చేయలేకపోయారు.

ఈ చిత్రం రొమాంటిక్ లవ్ స్టోరీగా ప్రభాస్ అభిమానులు, సినీ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. అయితే యూరప్ (1980) లో ఆ కాలం నాటి సెట్లు నిర్మించింది చిత్రయూనిట్. ఈ చిత్రంలో ఈ సన్నివేశాలు హైలెట్ అవ్వబోతున్నాయట. రాధేశ్యామ్ వాల్ పోస్టర్లు, టీజరు సినీ ప్రేక్షుల్ని ఆకర్షిస్తున్నాయి. ఈ మూవీలో కృష్ణం రాజు కీలక పాత్రలో నటించబోతున్నారట.

ఈ మూవీలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే.. పాన్ ఇండియ సినిమా పతాకంపై రెబల్ స్టార్, డా.యూ.వి.కృష్ణం రాజు సమర్పణలో పేరొందిన నిర్మాణ సంస్థలు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందుతోంది. వంశీ, ప్రమోదు, ప్రసీద (ప్రభాస్ సిస్టర్) ప్రయోగాత్మకంగా చేపట్టిన సినిమా అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *