యంగ్ రెబల్ స్టార్.. రాధేశ్యామ్ టీజర్ రిలీజ్

యంగ్ రెబల్ స్టార్.. రాధేశ్యామ్ టీజర్ రిలీజ్

యంగ్ రెబల్ స్టార్.. రాధేశ్యామ్ టీజర్ రిలీజ్

యంగ్ రెబల్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా రాధేశ్యామ్ టీజర్ ను విడుదల చేసిన మేకర్స్. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌-పూజ హెగ్డే హీరో హీరోయిన్‌గా నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘రాధేశ్యామ్‌’ టీజర్ వచ్చేసింది. అయితే ఈ చిత్రంలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, టీజర్లోని సీన్స్, ప్రభాస్ చెప్తున్న ఒక్కో డైలాగ్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టీజర్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే 100కే లైక్స్ సాధించడం మరో విశేషం. టీజర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ లభించింది. ప్రభాస్ మాత్రం ఇప్పటికే మూడు సినిమాలు చేశాడు. ఆ మూడు సినిమాలు ఆయనకు క్రేజ్ తెచ్చిపెడతాయని అనుకుంటున్నారు. ప్రభాస్ కి దేశవ్యాప్తంగా కాదు ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచాడు. పైగా ‘రాధేశ్యామ్’ టీజర్ మోస్ట్ అవైటెడ్ అని చెప్పొచ్చు. అయితే రాధేశ్యామ్ సినిమా పట్ల టీజర్ కోసం రెబల్ స్టార్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ టీజర్ ఉత్కంఠ భరితంగా కొనసాగింది.

ఈ చిత్రాన్ని కె.రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించిన.. వంశీ, ప్రమోద్‌, ప్రసీదలతో కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా మొత్తం ఇటలీ నేపథ్యంగా సాగే పీరియాడికల్‌ “ప్రేమ కథ” గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో ప్రభాస్‌ విక్రమాదిత్య పాత్రలో పోషిస్తున్నారు, ప్రేరణ పాత్రలో హీరోయిన్ పూజ హెగ్డే నటిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *