హరియానాలో రైతులపై పోలీసుల లాఠీఛార్జి

హరియానాలో రైతులపై పోలీసుల లాఠీఛార్జి

హరియానాలో రైతులపై పోలీసుల లాఠీఛార్జి

రాబోయే మునిసిపల్ ఎన్నికల గురించి చర్చించడానికి హరియానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి వ్యతిరేకంగా.. శాంతియుతంగా నిరసనకు దిగారు రైతులు. కర్నాల్‌లోని ఘరౌండ టోల్‌ప్లాజా దగ్గర రైతులు  ఆందోళన చేయడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఆ సమయంలో వేలాదిగా త‌ర‌లివచ్చిన రైతులు రోడ్ల మీద మంచాలు వేసుకొని కూర్చొని మరీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ క్రమంలో రైతులను పోలీసులు చితక బాతారు.

హరియానాలో ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసుల లాఠీచార్జీని ఖండించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. దేశంలో రైతుల రక్తం చిందింది. మరోసారి దేశం సిగ్గుతో తలవంచుకుంటోందంటూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు. దీంతో పాటు పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడి, రక్తమోడుతున్న ఒక రైతు ఫోటోను ఆయన ట్వీట్‌ చేశారు.ఈ సందర‍్భంగా రక్త మోడుతున్న రైతు ఫోటోలు, వీడియోలు సోషల్‌  మీడియాలో  హల్‌ చల్‌ చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: