మరో రెండ్రోజుల పాటు భారీ నుంచి అతి వర్షాలు

మరో రెండ్రోజుల పాటు భారీ నుంచి అతి వర్షాలు

చైన్నైకి ఆగ్నేయంగా కేంద్రీకృతమైన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతున్నాయి. దీంతో మరోసారి హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. గత రెండ్రోజులుగా భారీ వర్షాలు పడటంతో నెల్లూరు, అనంతరం, తిరుపతి, చిత్తూరులో విద్యుత్, రోడ్డు, రవాణా సంస్థలు చెల్లాచెదురు అయ్యాయి. తమిళనాడు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురి శాయి. బంగాళాఖాతంలో గంటకు 18.కీ.మీ వేగంతో కదులుతున్న వాయుగుండం. పుదుచ్చేరి చైన్నై మధ్య తీరం దాటిందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. తీవ్రమైన గాలులు రావడంతో మత్స్య కారులు వేటకు వెళ్లొద్దని అధి కారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

మరోసారి చిత్తూరుకు తప్పని వరద ప్రభావం: గత రెండో రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు గ్రామాలు, కాలనీలు వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్నాయి. రెవెన్యూ, పోలీసులు సహా ఇతర అధికారులు సహాయ చర్యలు చేపడుతున్నారు. తిరుపతిలో మునుపున్నెడూ లేనంత విధంగా భీకరంగా వర్షం దంచి కొడుతుంది. తిరుపతి కాలినడక మార్గంలో వరద పొంగి పొర్లుతోంది. దీంతో ఆ రహదారి మూసివేశారు. ఈ భారీ వర్షాల కారణంగా చిగురువాడ-కేసీపేట మధ్య కూలిన స్వర్ణముఖి బ్రిడ్జి దీంతో వరద పోటెత్తుతుంది. దీని చుట్టుప్రక్కల ఊళ్లన్నీ జలమయ్యాయి. భారీ వర్షాలు వరదలతో జలవిలయంతో వైకుంఠ క్యూలైన్లలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. శ్రీవారి మాడవిధులు చెరువులను తలపించాయి.

కళ్యాణి డ్యామ్‌ 3గేట్లు తెరవడంతో స్వర్ణ ముఖి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఘాట్‌రోడ్‌లో 13 చోట్ల కొండ చరియలు విరిగి పడ్డాయి. కడప, చిత్తూరు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిన ఐఎండీ అధికారులు. అలి పిరి, శ్రీవారి మార్గం. కపిల తీర్థం దగ్గర ప్రమాదస్థాయిలో పొంగిపోర్లుతున్న వరద.. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట జలమయ్యమయ్యాయి. టీటీడి కంప్యూటర్‌ రూంలోకి వరదనీరు చేరడంతో సర్వర్లను ఆపివేశారు. టీటీడీ కార్యాలయానికి సెలవు ప్రకటించిన టీటీడి.

గడచిన 50 ఏళ్లలో ఇంతటి వర్షాన్ని ఎప్పుడు చూడలేదని స్థానికులు అంటున్నారు. చిత్తూరు వ్యాప్తంగా పొంగిపోర్లుతున్న వాగులు వంకలు, ప్రమాదంలో మరికొన్ని కాలనీలు వరద నీరు పోటెత్తడంతో బుగ్గ వంక 4 గేట్లను ఎత్తి నీటిని వదిలిన అధికారులు. పశువులు సైతం వరదనీటిలో కొట్టుకుపోవడంతో ఏం చేయలేని పరిస్థితుల్లో స్థానికులున్నారు. ఇవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీనిపై సీఎం జగన్ సహాయక చర్యలు పర్యవేక్షించాలని.. ఎప్పటికప్పుడు అప్రమత్తతో ఉండాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *