శరన్నవరాత్రుల్లో చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరీ

శరన్నవరాత్రుల్లో చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరీ

శరన్నవరాత్రుల్లో చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరీ

దేవీ శరన్నవరాత్రుల్లో చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఈ రోజును విజయదశమి (దసరా) అంటారు. దసరా అంటే ధన్-హరా అని అర్థం. సమస్త భూ ప్రంచానికి ఇమె మహాదేవత. లోకపాలకులైన అష్ట దిక్పాలకులను పాలించేవారు త్రిమూర్తులు. ఆ త్రిమూర్తులను పాలించే దేవతను రాజ రాజేశ్వరిగా పిలుస్తారు.

అమ్మవారి అవతారం: శ్రీ రాజరాజేశ్వరీ దేవి

అమ్మవారి చీర: ఆకుపచ్చని రంగు చీర

సువాసినులు ధరించాల్సినవి: లేత లేదా ముదురు ఆకుపచ్చని రంగు చీర

అమ్మవారికి నైవేద్యం: పులిహోర, చక్కెర పొంగలి, గారెలు.. బూరెలు, కదంబం, కూరగాయల అన్నం, కట్టు పొంగలి, పాయసం, ఛిత్రాన్నం, దద్దోజనం, రవ్వ కేసరి, కొబ్బరి అన్నం, పండ్లు ఇలా అన్ని రకాల నైవేద్యాన్ని సమర్పించవచ్చు.

లలితా సహస్రనామ పారాయణం: అమ్మవారికి కుంకుమార్చన చేయాలి. అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ , బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురసుతా దేదీప్యమానోజ్జ్వలా, చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ శ్లోకం పఠించాలి.

అమ్మవారి కథ: తొమ్మిది రోజుల పాటు అమ్మవారు రోజుకో అవతారంలో రాక్షసులను సంహరించి లోకానికి శాంతి సౌభాగ్యాలు ప్రసాదించినందుకు గుర్తుగా “విజయదశమి”ని(దసరా)ని  జరుపుకుంటాం. ఈ పండుగను ఎక్కువగా నార్త్ సైడ్ ఎక్కువగా చేస్తారు.

ఈ రోజున భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత రాజరాజేశ్వరీదేవి. మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. ఈ దేవత ‘అపరాజితాదేవి’ గా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా..ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుందీ రాజరాజేశ్వరీ తల్లి. యోగమూర్తిగా.. మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉత్తేజపర్చిచి అందరికి శక్తి లభించేలా చేస్తుంది. ఇంకో విశేషమేమిటంటే అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత.

అమ్మవారు ఏరూపంలో ఉంటుంది:  అమ్మ ఒక చేతిలో చెరకుగడ, ఇంకో చేతిలో అభయముద్రతో భక్తులను అనుగ్రహిస్తూ దర్శనం ఇస్తుంది. చెరకు రసం అత్మజ్ఞానాన్ని సూచిస్తుంది. దుష్టులను, దురహంకారులను, శిక్షించుటకు అంకుశం, పాశం ధరించి ఉంటుంది. ఆమె ప్రశాంతమైన చిరునవ్వు, చల్లని చూపు భక్తులకు అందింస్తుది రాజరాజేశ్వరీ దేవి. ఈ దేవత సమున్నతమైన దైవిక శక్తికి ఈమె ప్రతీక. ఈమె చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని సాధించే నేర్పు కలిగి ఉండటం, ఉన్నతమైన భావాల్ని వ్యాప్తి చేయడం రాజరాజేశ్వరి అవతారం గురించి అందరికీ నేర్పాల్సిన అవసరం ఉంది. ప్రతి హిందూవుకు తెలియ జెప్పాల్సిన అంశంగా చెప్పొకోవచ్చు .

రాజరాజేశ్వర్యష్టకం అష్టకంతో పాటుగా లలితా పారాయణం చేసి అందరూ ప్రసాదాలు తీసుకొవాలి. ఈరోజు గుడికి వెళ్లి జమ్మిచెట్టుకు పూజ చేసి, మీ కోరికల్ని నేరవేర్చిలా అమ్మను మనసులో తల్చుకోవాలి. ఈరోజు పాలపిట్టను చూస్తే చాలా మంచిది. మన సుభాలు కలుగుతాయని శాస్త్రాల్లో వల్లించబడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: