ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్.. అంతా కూల్ అన్న ఫ్యామిలి
రజనీ కాంత్ ఆస్పత్రిలో చేరారు. సాధారణ చెకప్ లోనే భాగంగా తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆసుపత్రికి వెళ్లారని..ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని రజనీ సతీమణి లతా తెలిపారు. గురువారం సాయంత్రం ఉన్నట్టుండి చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. కాగా, భారతీయ సినిమా అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న కొన్ని రోజుల్లోనే ఆయన ఆస్పత్రిలో చేరడంతో.. అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
కాగా, శుక్రవారం రోజు పూర్తిగా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలని ఆసుపత్రి వర్గాలు చెప్పినట్లు సమాచారం. తలనొప్పి, అస్వస్థత కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారనే ప్రచారమూ జరిగింది. గురువారం రాత్రి రజనీకాంత్‌ను చూసేందుకు ఆయన కుమార్తె ఐశ్వర్య కావేరి ఆస్పత్రికి వచ్చారు.
కాగా, దీనికి ముందు రోజు కుమార్తె సౌందర్య కొత్తగా ప్రారంభించిన యాప్‌లో రజనీ వాయిస్ నోట్‌ను షేర్ చేశారు. అందులో రాబోయే దీపావళి పర్వదినం వేల విడుదల కానున్న తన అన్నాత్తై సినిమాను మనవడు వేద్ కృష్ణ, కుటుంబ సభ్యులతో కలిసి చూస్తానంటూ మాట్లాడారు.