ఖేల్ రత్న..ఇకపై మేజర్ ధ్యాన్ చంద్ గా మార్పు

ఇకపై ఖేల్ రతన్నను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా మార్పు
ఇండియాలో క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఇచ్చే ఖేల్ రత్న అవార్డు పేరును మార్చుతూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఖేల్ రత్నఅవార్డు పేరు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా పిలుస్తారు. ఈ అవార్డు పేరు మార్పుపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజల నుంచి వినతులు అందాయని ప్రధాని మోడీ చెప్పారు. ప్రజల సెంటిమెంట్లను గౌరవిస్తానని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
దేశ ప్రజలు తమ మనోభావాలన్ని తెలియ జేసినందుకు ధన్య వాదాలు అని మోడీ అన్నారు.
ఒలింపిక్స్ లో భారత్ ను ప్రపంచ పటంలో నిలిపిన ప్లేయర్ మేజర్ ధ్యాన్ చంద్ అనే చెప్పుకోవాలి. అందుకే భారత అత్యుత్తమ క్రీడా పతాకానికి ధ్యాన్ చంద్ పేరును పెడుతున్నామని మోడీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. 1991-92లో ఖేల్ రత్న అవార్డును రాజీవ్ గాంధీ ఖేల్ రత్నగా పిలిచేవారు.