రామేశ్వరంలో 50 అడుగులు వెనక్కి వెళ్లిన సముద్రం

రామేశ్వరంలో 50 అడుగులు వెనక్కి వెళ్లిన సముద్రం
పుణ్య క్షేత్రమైన రామేశ్వరం సముద్ర తీర ప్రాంతంలో 50 అడుగులు వెనక్కు వెళ్లిపోయింది. కాశీ వెళ్లిన వారు.. రామేశ్వరంలో స్నానాలు ఆచరిస్తుంటారు. సముద్రం వెనక్కి వెళ్లడంతో తీర ప్రాంతంలో ఆగిన బోట్లు ఇసుకలో నిలిచిపోయాయి. ఈ ఘటన బుధవారం ఉదయం జరిగింది. సముద్ర తీర ప్రాంతంలో ఒక్కసారిగా ఉదయం నుంచి బలమైన ఈదురు గాలులు వీచాయి. దీంతో హఠాత్తుగా సముద్రం 50 అడుగులు వెనక్కు వెళ్లిపోయింది. తీర ప్రాంత ప్రజలు అంతా ఒక్కసారిగా బండరాళ్లను చూసి ఉలిక్కి పడ్డారు. రామేశ్వరం హార్బర్ ప్రాంతం నుంచి సంగుమాల్ ప్రాంతం వరకు సముద్రం 50 అడుగులు వెనక్కు వెళ్లిపోయి కనిపించింది. అలాగే తీర ప్రాంతంలోనూ బండరాళ్లు బయటపడ్డాయి. దీనికి కారణం వాతావరణంలో మార్పులేనని మేము ఇలాంటి ఘటనలు ఎన్నో చూశామని మత్స్యకారులు చెబుతున్నారు. పర్యావరణ శాస్త్రవేత్తలు ప్రకృతిలో విపత్తులు జరిగినప్పుడు ఇలాంటి ఘటనలే జరుగుతుంటాయని తెలిపారు.