తెలంగాణలో ఈనెల 11 వరకు రైతుబీమా దరఖాస్తుల స్వీకరణ

తెలంగాణలో ఈనెల 11 వరకు రైతుబీమా దరఖాస్తుల స్వీకరణ

తెలంగాణలో ఈనెల 11 వరకు రైతుబీమా దరఖాస్తుల స్వీకరణ

పట్టాదారు, రైతులు రైతుబీమాకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 11 వరకు వ్యవసాయశాఖ అవకాశమిచ్చింది. 2021 ఆగస్టు 3 లోపు భూమి రిజిస్టర్ చేసుకున్న రైతులు అర్హులు. ఆధార్ ప్రకారం వయస్సు 18 నుంచి 59 ఏళ్లుండాలి. ఎన్ని చోట్ల భూమి ఉన్న ఒకే ఊరిలోనే బీమాకు అవకాశం ఉందని సర్కార్ తెలిపింది. అయితే రైతే స్వయంగా నామినేషన్ ఫారం మీద సంతకం చేసి పాస్ పుస్తకం, ఆధార్, నామిని ఆధార్ జిరాక్స్ AEO కు అందచేయాలని అధికారులకు సూచించారు. ఆగస్టు 11లోగా దరఖాస్తు చేసుకోకపోతే ఏడాది వరకు అవకాశం ఉండదని అధికారులు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో వేరుశనగ ప్రధాన పంట కావాలంటూ వ్వవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. వేరుశనగ పరిశోధన కోసం రూ.9కోట్లతో ప్రత్యేక కథనాన్ని రూపొందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఇక్రిశాట్ సహకారంతో వేరుశనగ వంగడాల రూపకల్పన కోసం పరిశోధనలు చేయిస్తున్నామని.. వైరస్ ల బారి నుండి తట్టుకునే వంగడాలను రూపోందేలా తయారు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి నిరంజన్ రెడ్డి. మార్కెట్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో వేరుశనగ నాణ్యత, దిగుబడులు పెరిగేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *