TS: టీకా తీసుకోకపోతే రేషన్ కట్ అంటూ ప్రచారం..? క్లారిటీ ఇచ్చిన సర్కార్
వ్యాక్సినేషన్ తీసుకోకపోతే రేషన్ కట్ అంటూ ప్రచారం..?
క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్..
ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకొని వారికి రేషన్ కట్టు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకోనివారికి వచ్చే నెల నుంచి రేషన్, పింఛన్ నిలిపేస్తారని దీని సారాంశం. దీనిపై తాజాగా తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఈ వార్తలను వైద్యారోగ్య శాఖ ఖండించింది.
సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న వార్తలన్నీ ఖండించిన తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. దీనిపై ప్రభుత్వ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. తప్పుడు వార్తల్నీ ప్రజలు నమ్మొద్దని అన్నారు. దీనిపై ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని తెలిపారు.