మాస్ మహారాజ మూవీ ఏంటంటే..

మాస్ మహారాజ మూవీ ఏంటంటే..

రవి తేజ కొత్త మూవీ ఏంటంటే..

సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ పేరు తెచ్చుకున్న హీరోలలో రవితేజ ఒకరు.. రవితేజ అంటే ఓ మాస్ మారాజాగా పేరు తెచ్చుకున్న హీరో రవితేజ. రవితేజ ఈ మధ్యనే తీసిన సినిమా    “ క్రాక్ “ బ్లాక్ బ్లసర్ మూవీగా తెరకెక్కింది. అయితే సినీ పరిశ్రమ లో కొన్ని కాంబినేష‌న్స్ కి క్రేజ్  మామూలుగా ఉండదు. సక్సెస్ లేకపోయినా.. ప్రేక్షకులు వారిని ఆదరించడమే కాకుండా ఆ కాంబినేషన్స్ రిపీట్ అవుతోంది. టాలీవుడ్‌లో రవితేజ, ఇలియానా కాంబినేష‌న్‌ లతో తీసిన చిత్రాలు ఎన్నో హిట్ అయ్యాయి. అయితే తాజగా వీరిద్దరు కలిసి మరోసారి వెండితెరపై ప్రేక్షకులని అలరించనున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

రవితేజ ఇలియానా కాంబినేష‌న్‌లో కిక్ బ్లాక్ బస్టర్ గా అవ్వడంతో మరోసారి జతకట్టేందుకు రెడీ అవుతున్నారట. లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ర‌వితేజ‌ ఇలియానాతో కలిసి మరో చిత్రం తీయ్యబోతున్నారట. అయితే ఈసారి ఇలియానా హీరోయిన్‌గా కాకుండా ర‌వితేజ సినిమాలోని స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించ‌నుంద‌ని సమాచారం.ప్ర‌స్తుతం ర‌వితేజ “ రామారావు ఆన్ డ్యూటీ” అనే చిత్రంలో నటిస్తుండగా.. అయితే మాస్ మారాజుకు స్పెషల్ సాంగ్ చేసేందుకు గోవా లో గోవా బ్యూటీతో స్పెష‌ల్ సాంగ్ చేస్తున్నారని చిత్రయూనిట్ తెలిపింది.

శరత్ మండవ డైరెక్షన్ లో ‘రామారావు ఆన్ డ్యూటీ’ రవితేజ నటిస్తున్నారు. ఇందులో మ‌జిలి ఫేమ్ దివ్యాంశ కౌశిక్‌తో పాటు రజిష విజయన్ హీరోయిన్లుగా నటించనున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ తో పాటుగా రవితేజ టీం వర్క్స్ బ్యానర్లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజ ఒక పవర్ ఫుల్ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో కనిపించనున్నాడు. ఏదీ ఏమైనా మాస్ మాహారాజా అభిమానులను, ప్రేక్షకులను ఏ విధంగా క్రేజ్ సంపాదించుకుంటారో మరి వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *