Site icon Telugu Word

రూ. 2 వేల నోట్ల‌పై ఆర్బీఐ కీల‌క ప్ర‌క‌ట‌న‌

రూ. 2 వేల నోట్ల‌పై రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వాటిని బ్యాంకుల్లో ఇచ్చి.. అంతే విలువ క‌లిగిన అమౌంట్ ను పొందొచ్చ‌ని తెలిపింది. కేంద్రం రూ. 2 వేల నోట్ల‌ను ఉప‌సంహ‌రించుకున్న సంగ‌తి తెలిసిందే. త‌ర్వాత ప్ర‌జ‌లు వాళ్ల ద‌గ్గ‌రున్న ఆ నోట్ల‌ను బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. అయితే ఇంకా రూ. 6,017 కోట్ల విలువైన 2 వేల కరెన్సీ నోట్లు వారి ద‌గ్గ‌రే ఉండిపోయాయి. రిజర్వ్ బ్యాంక్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.

ప‌లు కార‌ణాల వ‌ల్ల ఇప్ప‌టికీ రూ. 2 వేల నోట్ల‌ను మార్చుకోలేని వాళ్లు బ్యాంకుల‌కు వెళ్లి ఛేంజ్ చేసుకోవ‌చ్చు. హైదరాబాద్ తో పాటు దేశ వ్యాప్తంగా 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాల‌యాల్లో ఈ స‌దుపాయం ఉంది. హైద‌రాబాద్, బెంగ‌ళూరు, చెన్నై, బేలాపూర్, అహ్మ‌దాబాద్, చండీ గ‌ఢ్, భోపాల్, కోల్ క‌తా, భువనేశ్వ‌ర్, జైపూర్, జ‌మ్మూలోని ఆఫీస్ ల‌కు వెళ్లి నోట్ల‌ను మార్చుకోవ‌చ్చు. అలాగే, ముంబై, ల‌క్నో, ప‌ట్నా, ఢిల్లీ, తిరువ‌నంత‌పురం, నాగ్ పూర్ లో కూడా ఈ అవ‌కాశ‌ముంది.

అలాగే ఈ నోట్లను స్పీడ్ పోస్ట్ ద్వారా ఆర్బీఐ కార్యాలయాలకు సెండ్ చేసి కూడా మార్చుకోవ‌చ్చు. వాటిని క‌స్ట‌మ‌ర్లు కోరిన బ్యాంకు అకౌంట్ల‌లో డిపాజిట్ చేస్తారు. ఇందుకుగానూ వాళ్లు ఆధార్, బ్యాంకు ఖాతా వివ‌రాలు, నోట్ల వ్యాల్యూతో పాటు మ‌రికొన్ని వివ‌రాలు ఇవ్వాల్సి ఉంటుంది. వాటిని చెక్ చేసి.. ఆ అకౌంట్లో మ‌నీని జ‌మ చేస్తారు.

ఇలాంటి మంచి ఆర్టికల్స్ అందిస్తున్న TELUGU WORD టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Read also : TOP 6 MOBILES UNDER 20K – AMAZON FREEDOM SALE

Read also : గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ ను లాంఛ్ చేసిన శామ్ సంగ్

Read also : రూ.1కే 30 రోజుల అన్‌లిమిటెడ్‌ కాల్స్‌

Exit mobile version