డ్వాక్రా గ్రూపులకు RBI శుభవార్త

డ్వాక్రా గ్రూపులకు RBI శుభవార్త
డ్వాక్రా మహిళలకు దేశీయ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీపికబురు అందించింది. అయితే RBI ఇచ్చే రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో స్వయం సహాయక బృందాలకు కొంత ఊరట కలిగింది. కేంద్రం కోరిన విధంగా.. ఆర్బిఐ కొత్త రూల్స్‌ను జారీ చేసింది. దీని ద్వారా స్వయం సహాయక బృందాలకు ఎక్కువ రుణం లభించనుంది.
స్వయం సహాయక బృందాలు ఇకపై ఎలాంటి తనఖా లేకుండానే రూ.20 లక్షల వరకు రుణం పొందొచ్చు. గతంలో ఈ లిమిట్ రూ.10 లక్షలుగా ఉండేది.
దీన్‌దయాల్ అంత్యోదయ యోజన- నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్‌లో భాగంగా RBI ఈ అవకాశం కల్పిస్తోంది. ఇందులో భాగంగానే పేదరికాన్ని నిర్మూలన చేసేదే ప్రధాన లక్ష్యం. ఈ రుణంతో మహిళలకు అధిక ప్రాధాన్యం లభిస్తుంది. ఆర్బిఐ ఇచ్చే ప్రోత్సాహకంతో కేంద్ర ప్రభుత్వం వారిని స్వయం సమృద్ధి దిశగా నడిపించనుంది.
ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకారం.. బ్యాంకులు స్వయం సహాయక గ్రూప్స్‌కు రుణాలు మంజూరు చేసేటప్పుడు ఎలాంటి డిపాజిట్లను తీసుకోకూడదు. డ్వాక్రా సేవింగ్స్ ఖాతాలపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదు. డ్వాక్రా లోన్ మంజూరు చేసే సమయంలో ఎలాంటి మార్జిన్ కూడా తీసుకోవద్దు. డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షలలోపు రుణ మొత్తానికి క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్ కవరేజ్ లభిస్తుంది.