RBI గవర్నర్గా మరో మూడేళ్లు శక్తికాంత దాస్
RBI గవర్నర్గా మరో మూడేళ్లు శక్తికాంత దాస్
గవర్నర్ శక్తికాంత దాస్ మారో మూడేళ్ల పాటు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ)గా ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రధానమంత్రి నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది. శక్తికాంత దాస్ డిసెంబరు 10తో ఆయన తొలి మూడేళ్ల పదవీకాలం ముగియనుంది.
కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక కార్యకలాపాలన్నీ దెబ్బతిని వ్యవస్థలో ద్రవ్యలభ్యత సమస్య ఏర్పడ్డ విషయం తెలిసిందే. దీంతో శక్తికాంత దాస్ రంగంలోకి దిగిన ఆర్బీఐ గవర్నర్ ఆ సమస్యను పరిష్కరించేందుకు కీలక చర్యలు చేపట్టారు. వడ్డీరేట్లను తగ్గిస్తూ ద్రవ్యపరపతి విధానంలో సర్దుబాటు వైఖరిని కొనసాగించారు. ఆర్బీఐ తరఫున ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు శక్తికాంత దాస్ తగు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా లోన్ మారటోరియం సత్ఫలితాలిచ్చింది. దీన్ని రూపొందించిన విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకొంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రత్యేక మినహాయింపులు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో ముందుకు నడిచారు. శక్తి కాంత్ దాస్ ఆలోచనలతో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ఆర్థిక వ్యవస్థకు మరింత శక్తిని నింపేందుకు శక్తికాంత దాస్ వ్యూహాలు మరింత అవసరమని ప్రభుత్వం ఆలోచన చేసింది.