బ్యాంక్ లాకర్లకు కొత్త రూల్స్ : RBI

బ్యాంక్ లాకర్లకు కొత్త రూల్స్ పెట్టిన RBI
జనవరి 1, 2022 నుంచి అమలు
ఆర్బీఐ కొత్త రూల్స్ ని అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ రూల్స్ తో..రూల్సరబ్యాంక్ లాకర్ల నిబంధనలు మారిపోతున్నాయి. ఆర్బీఐ సవరించిన నిబంధనల ప్రకారం లాకర్లలోని వస్తువులేమైనా పోయినా, పాడైనా లాకర్ వార్షిక రెంట్ మీద (అద్దె) 100రెట్లకు మించి పరిహారం లభించదని ఆర్బీఐ తెలిపింది. అది కూడా ఫైర్ యాక్సిడెంట్స్, చోరీ, లాకర్లు ఉన్న భవనం కూలిపోవడం లేదా బ్యాంక్ ఉద్యోగుల మోసాల కారణంగా జరిగిన నష్టాలకే పరిమితం. అయితే ఈ నిర్ణయాన్ని అన్ని వర్గాలను సంప్రదించే ఈ కొత్త నిబంధనలు రూపొందించినట్టు ఆర్బీఐ తెలిపింది.
అయితే ఈ కొత్త నిబంధనలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి తెస్తామని ఓ ప్రకటనలో తెలియజేసింది. అయితే లాకర్ వినియోగదారులు.. బ్యాంక్ లాకర్లో ప్రమాదకర వస్తువులుగానీ, చట్ట వ్యతిరేకమైన వస్తువులుగానీ గ్యారంటీగా పెట్టడం లేదని లాకర్ తీసుకునేటపుడు లీగల్ గా అన్ని ఒప్పందాలపై సంతకాలు పెట్టాలని సూచించారు. అయితే బ్యాంక్ ల్లో సరైన నడవడిక కలిగిన కస్టమర్లపై ఎటువంటి ఒత్తిడి, డిపాజిట్లు వసూలు చేయకూడదని ఆర్బీఐ సూచించింది.
బ్యాంకులకు ఆర్బీఐ సూచనలు:
ఎవరైనా బ్యాంక్ లాకర్ కొత్తగా తీసుకోవాలంటే మూడేళ్ల లాకర్ రెంట్, బ్రేకింగ్ ఛార్జీలకు సరిపడే వడ్డీ వచ్చేలా టర్మ్ డిపాజిట్ తప్పనిసరి చేయాలని సూచన
కొత్త లాకర్లు తీసుకునే వారితో పాటు, పాత వారికీ కొత్త నిబంధనల అమలు చేయాలని ఆర్బీఐ సూచన
అన్ని బ్యాంకులు శాఖల వారీగా ఖాళీ లాకర్ల జాబితాను బ్యాంకులు ఎప్పటికపుడు కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ (సీబీఎ్‌స) లేదా ఇతర కంప్యూటర్ ఆధారిత సిస్టమ్‌లో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలని సూచన
చనిపోయిన వారి బ్యాంకులో లాకర్లు ఉంటే..కుటుంబ సభ్యుల నుంచి సరైన ధృవ పత్రాలుంటేనే బ్యాంకు లాకర్ తెరవాలని ఆర్బీఐ సూచన.
కొత్తగా లాకర్ కోసం దరఖాస్తు చేసిన వారికి రసీదుతో పాటు, వెయిటింగ్ లిస్టు నంబర్ కూడా ఇవ్వాలి. సరైన ప్రూప్ కూడా తీసుకోవాలి.
బ్యాంక్ లో ఖాతాలున్న పాత వినియోగదారులకు టర్మ్ డిపాజిట్ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆర్బీఐ సూచన
బ్యాంక్ లో కస్టమర్ లాకర్ రెంట్ ఒప్పందం ఐబీఏ పేర్కొన్న నమూనాలోనే ఉండాలి. దీనికి విరుద్దంగా ఉంటే అధికారులే బాద్యత వహించాలి.
ప్రకృతి వైపరీత్యాల కారణంగా లాకర్లు ఉన్న ప్రాంతానికి ఎలాంటి నష్టం జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవలసిన బాధ్యత మాత్రం బ్యాంకులదే.
బ్యాంక్ కస్టమర్ వరుసగా మూడేళ్ల పాటు లాకర్ రెంట్ చెల్లించకపోతే, బలవంతంగా ఆ లాకర్‌ను తెరిచే బాధ్యత బ్యాంకులకు ఉంటుందన్న ఆర్బీఐ
ప్రకృతి వైపరీత్యాల కారణంగా లాకర్లోని వస్తువులు పాడైనా, పోయినా బ్యాంకులకు బాధ్యత ఉండదు. అట్టి పత్రాలపై కస్టమర్ల సంతకాలు తప్పని సరి.