ఆస్పత్రిలో చేరిన రెబల్ స్టార్ కృష్ణం రాజు

ఆస్పత్రిలో చేరిన రెబల్ స్టార్ కృష్ణం రాజు

రెబల్ స్టార్ కృష్ణం రాజు ఆరోగ్యం పై పుకార్లు  

యూకే వెళ్తున్నారని ప్రకటించిన ఆఫీస్ 

హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో రెబల్ స్టార్ కృష్ణం రాజు అడ్మిట్ అయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇప్పటికే సాయ్ ధరమ్ తేజ్ యాక్సిండెట్ గురియై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. రొటీన్ హెల్త్ చెకప్ లో భాగంగా ఆసుపత్రిలో కృష్ణంరాజు అడ్మిట్ అయ్యారని డాక్టర్లు వెల్లడించారు. కృష్ణంరాజు గారి ఆరోగ్యం బాగుంది అని కూడా తెలిపారు.

సోషల్ మీడియాలో కృష్ణంరాజు ఇంట్లో కాలు జారి కింద పడ్డారని, దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించారని వార్తలు చక్కర్లు కొట్టాయి. కృష్ణం రాజుగారు త్వరలో UK వెళ్లాల్సి ఉన్నందున రొటీన్ హెల్త్ చెకప్ చేసుకోవడానికి కృష్ణంరాజు అపోలో ఆస్పత్రికి వచ్చారని కేంద్ర మాజీ మంత్రి యూ.వి.కృష్ణంరాజు కార్యాలయం ప్రకటించింది. మరోవైపు ICUలో చికిత్స తీసుకుంటున్న సాయిధరమ్ తేజ్ కుటుంబ సభ్యులతో తేజ్ ఆరోగ్య పరిస్థితి పై కృష్ణంరాజు చర్చించారు. సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను అని కృష్ణంరాజు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: