బరువు తగ్గాలనుకుంటున్నారా ? బీపీ, క్యాన్సర్ రాకుండా ఈ నీళ్ళు తాగండి !

బరువు తగ్గాలనుకుంటున్నారా ? బీపీ, క్యాన్సర్ రాకుండా ఈ నీళ్ళు తాగండి !

సోంపుని చాలామంది ఆహారం జీర్ణం కావడానికి మాత్రమే తీసుకుంటారు. ఇంకా మౌత్ ఫ్రెషనర్ గా వాడతారు. కానీ సోంపులో మనకి తెలియని అనేక రకాల పోషకాలున్నాయి. మాంగనీస్, జింక్, ఐరన్ లాంటి ఖనిజాలు ఇందులో ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సోంపును డైరెక్ట్ గా తినడం కాదు… సోంపు వాటర్ తాగడం చాలా చాలా మంచిదని యోగా గురువులు, ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

సోంపు వాటర్ తయారు చేసుకోవడం రెండు రకాలుగా ఉంటుంది

ఒకటి

సోంపును ముందుగా రాత్రంతా నానబెట్టాలి. ఆ తర్వాత ఉదయాన్నే వాటిని తాగవచ్చు. అవసరమైతే ఇందులో రాత్రి నానబెట్టేముందే మెంతులు కూడా వేసుకుంటే రెండు విధాలుగా కలసి వస్తుంది

రెండోది

సోంపుతో టీలాగా తయారు చేసుకోవచ్చు. చాలామంది కాఫీ, టీలు తాగడాన్ని మానుకోలేక పోతున్నారు. అలాంటి వాళ్ళు సోంపుతో టీ తయారు చేసుకోవచ్చు. 2.5 లీటర్ల నీటిలో ఏడు చెంచాల సోంపును వేసి… మరగబెట్టి దింపాలి. ఆ నీళ్ళన్నీ సోంపు రంగులోకి మారాక తాగాలి. ఈ రెండున్నర లీటర్ల సోంపు వాటర్ ను రోజు మొత్తం ఉపయోగించుకోవచ్చు. చల్లగా తాగినా ఓకే. లేదంటే మీరు తాగలనుకున్నప్పుడు వేడి చేసుకోవచ్చు. లేదా ఫ్లా్స్క్ లో పోసుకొని తాగొచ్చు.

సోంపు ఉపయోగాలు

బరువును తగ్గిస్తుంది

మెటబాలిజం రేటును పెంచి ఫ్యాట్ కరిగించడంలో సోంపు నేచురల్ బూస్టర్ లాగా పనిచేస్తుంది. ఇది డ్యూరియాటిక్ పదార్థం. అందుకే బరువు తగ్గించడంలో వాటర్ రిటెషన్ తగ్గించడంలో సోంపు ఉపయోగపడుతుంది. సోంపును డ్రై రోస్ట్ చేసి, పొడి చేసుకుని రోజుకు రెండుసార్లు గోరు వెచ్చని నీటితో తాగాలి. చెడు కొలెస్ట్రాల్ ను నిరోధించి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

జీర్ణక్రియకు.. సోంపు తినడం.. సోంపు నీరు తాగడం వలన గ్యాస్ట్రిక్ ఎంజైమ్ ల ఉత్పత్తి పెంచుతుంది. జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. మలబద్ధకం, అజీర్ణం, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు తొలగుతాయి.

బీపీ తగ్గుతుంది

బీపీ తగ్గడానికి సోంపు వాటర్ బాగా ఉపయోగపడుతుంది. పొటాషియం బాగా ఉండే ఈ సోంపు శరీరానికి మేలు చేస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది.

కంటి చూపు మెరుగు

కంటి ఆరోగ్యానికి.. కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఈ సోంపులో విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వల్ల కళ్లకు చాలా మంచిది.

నొప్పుల నివారణ

సోంపు కాళ్ల నొప్పులను తగ్గిస్తుంది. రోజు సోంపు వాటర్ తాగడం వల్ల కాళ్ల నొప్పులు తగ్గుతాయి. మహిళలకు పీరియడ్స్ నొప్పిని కూడా తగ్గిస్తుంది.

క్యాన్సర్ దరి చేరదు

సోంపు అద్భుతమైన క్యాన్సర్ నివారిణిగా పనిచేస్తుంది. కడుపు, చర్మం, రొమ్ము క్యాన్సర్ లాంటి సమస్యల నుంచి రక్షిస్తుంది. ఇది ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే నష్టం తగ్గిస్తుంది.

ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిశాక… ఇంకా ఆలస్యం ఎందుకు… ఈ రోజు నుంచే మీ కొత్త సోంపు టీని తాగడం మొదలుపెట్టండి.  టీలు, కాఫీలను దగ్గరకు రానీయకండి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *