గంజి ఆరోగ్యానికి ఎంతో మేలు

గంజి ఆరోగ్యానికి ఎంతో మేలు

గంజి ఆరోగ్యానికి ఎంతో మేలు

మన తాత, ముత్తాల కాలం నుంచి గంజి అన్నానికొక ఓ ప్రత్యేకత ఉంది. అప్పట్లో ఒకపూట గడవడానికే ఇబ్బందులుండేవట.. ఒకపూట తిని మరొకపూట గంజి తాగేవారట. అయితే ఒకప్పుడు ప్రతి ఇంట్లో కట్టెల పొయిల మీద అన్నం వండి గంజి వార్చేవారు.

కాలం మారుతున్నా కొద్ది.. రైసు కుక్కర్లు యుగం వచ్చేసింది. కానీ ఇప్పుడా ఆ గంజి అవసరం లేకుండా పోయింది. చాలా మందికి ఈ గంజిలో ఉండే పోషకాల విలువ తెలియదు. కానీ నేటి పరిస్థితుల్లో గంజి అంటే తెలియని వారు ఉండడం విశేషం. కానీ నేటి పరిస్థితులలో మనం అన్నం ఎంత తెల్లగా ఉంటే అంత మంచిదని భావిస్తుంటారు.. కానీ దానిలో ఉండే పోషకాలు మాత్రం గురించి ఆలోచించరు. ఒకవేళ పట్టు తక్కువ బియ్యం తింటుంటే వాళ్లు మనల్ని ఆదోలా చూస్తారు. ఒకప్పుడు గంజితో ఉల్లిపాయలు, పచ్చి మెరపకాయ కలిపి తింటూ ఉండేవారు మన పెద్దలు. ప్రొద్దునే ఎక్సైజ్ చేసే వారు గంజి తాగితే వారికి ఎన్నో పోషకాలు వస్తాయి. ఇప్పుడిప్పుడే గంజి యొక్క ఆవశ్యకత గురించి ప్రాచుర్యంలోకి వస్తుంది. అప్పట్లో మజ్జిగ దొరకని వాళ్లు వేసవిలో చలువదనం కోసం గంజిని అన్నంతో కలిపి తీసుకుంటారు. గంజిని ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చట మరి అవేంటో చూద్దామ మరీ..

గంజి ఉపయోగాలు: గంజి గ్లూకోజ్ కంటే ఎక్కువ తక్షణ శక్తి అందిస్తుంది. గంజిలో శరారీనికి కావాల్సిన 8 రకాల ఎమినో యాసిడ్లు ఉంటాయి. డీహైడ్రేషన్ నుంచి చాలా రిలీఫ్ ఇస్తుంది. చల్లార్చిన గంజిని తీసుకొని శరీర భాగాలలో ఎక్కడైతే దురదతో పాటుగా మంట కూడా తగ్గుతుంది.గంజి తాగడం వల్ల కండరాలకు శక్తి వస్తుంది. గ్లాసు గంజిలో కొద్దిగా ఉప్పవేసి కలిపి తాగితే డయేరియా నుంచి బయటపడోచ్చు. మనం తలస్నానం చేసిన తర్వాత చేసిన తర్వాత కొద్దిగా గంజిని వెంట్రుకలకు పట్టించి ఒక 15 నిమిషాల తరువాత స్నానం చేస్తే  వెంట్రుకలు ఒత్తుగా, బలంగా, కాంతివంతగా పెరుగుతాయి. మనం కాటన్ బట్టలు నీటిగా, కాంతివంతంగా ఉండాలంటే గంజి పెడితే చాలా బాగుంటాయి.

ఒకప్పుడు పేదోడు ఈ గంజిని కుండ, మూకుళ్లలో పోసుకొని త్రాగితే.. ప్రస్తుతం ఈ గంజిని రెస్టారెంట్లలో దీనికొక అమృతంగా భావిస్తుంటారు. దీనికి బిల్లు బాగానే వేస్తారండోయి.. సో… మనం ఇంట్లో పారేసే గంజికి ఎంతో విలువ ఉందో మరీ తెలుసుగా… సో గంజి త్రాగే ప్రియులు జాగ్రత్త మరీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *