రాజమండ్రిలో ఘనంగా గిడుగు రామమూర్తి జయంతి

రాజమండ్రిలో ఘనంగా గిడుగు రామమూర్తి జయంతి

రాజమండ్రిలో ఘనంగా గిడుగు రామమూర్తి జయంతి

పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు

రాజమండ్రి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు పరిమి రాధాకృష్ణ

ఉండ్రాజవరం(మ)అక్కిన గోపాలకృష్ణ, కొలనువాడ కృష్ణం రాజు శీమకుర్తి నారాయణ,

యు.యస్.ఆర్. కె. పంచముఖి, పోట్లచెరువు రాధాకృష్ణ

గిడుగు రామమూర్తి జయంతి వేడుకలను తెలుగు భాషా దినోత్సవంగా తెలుగు రాష్ట్రాలు జరుపుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో “ తెలుగు అమ్మ భాషను రక్షించుకుందాం” అనే నినాదంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు రాజమండ్రి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు పరిమి రాధాకృష్ణ గారి అధ్యక్షతన జరిగిన తెలుగు భాష వారోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా సాంస్కృతిక రాజధాని అయిన రాజమహేంద్రవరంలో శంఖం పూరించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు..ఈ కార్యక్రమానికి ఉండ్రాజవరం మండలం బిజెపి పార్టీ నాయకులు అక్కిన గోపాలకృష్ణ, కొలనువాడ కృష్ణం రాజు శీమకుర్తి నారాయణ, ఉప్పులూరి యస్.ఆర్. కె. పంచముఖి, పోట్లచెరువు రాధాకృష్ణ గార్లతో పాటు తదితరులు తెలుగు భాష వారోత్సవాలలో పాల్గొనారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతూ భాషా శాస్త్రవేత్త గిడుగు వెంకట రామ్మూర్తి కృషితోనే “తెలుగు”కు కొత్త వెలుగులు వచ్చాయని..ఇరు రాష్ట్రాల పాలకుల నిర్వాకం వల్లే నిబద్ధత లేని కారణంగా ప్రస్తుతం అమ్మ భాష రోజురోజుకూ ప్రాధాన్యత కోల్పోతూ నిరాదరణకు గురవుతుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. నేటి తరంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పరభాషా వ్యామోహంపై ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. మాతృ భాష అయిన తెలుగును మర్చారు. తెలుగులో రాయడం అనేది విద్యార్థులు, పెద్దలు పూర్తిగా మర్చారు. అయితే తెలుగును పూర్తిగా మర్చి ఆంగ్ల భాషలోనే చదవడం నాగరికంగా మారిపోయిందని.. ఫలితంగా తెలుగును మర్చిపోయే దశకు చేరామని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *