ఆర్కే అంత్యక్రియల ఫోటోలను విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

ఆర్కే అంత్యక్రియల ఫోటోలను విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

అగ్రనేత ఆర్కే అంత్యక్రియల ఫోటోలను విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

కేంద్ర కమిటీ సభ్యుడు, మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్.. రామకృష్ణ, అలియాస్‌ సాకేత్ ఆర్కే అంత్యక్రియలు ముగిశాయి. కేంద్ర కమిటీ సభ్యుడైన ఆర్కే  (రామకృష్ణ) మావోయిస్టు లాంఛనాలతో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించినట్టు మావోయిస్టు పార్టీ అధికారికంగా తెలిపింది.

ఆర్కే అంత్యక్రియల అనంతరం ఫొటోలు విడుదల చేసింది మావోయిస్టు పార్టీ, అయితే మావోయిస్టు అక్కిరాజు హరగోపాల్ యొక్క అంత్యక్రియలను తెలంగాణ సరిహద్దులోని పామేడు-కొండపల్లి సరిహద్దులో నిర్వహించారు. అగ్రనేత అంత్యక్రియలకు మావోయిస్టులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కేంద్ర కమిటీ సభ్యుడైన ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా ఉంచి నివాళులర్పించారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు పూర్తిచేసినట్టు అధికారికంగా తెలిపింది  మావోయిస్టు పార్టీ తెలిసింది.

కాగా ఆర్కే గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని.. చికిత్స అందించినా కాపాడ లేకపోయామని.. గురవారమే ఆయనను కోల్పోయామని మావోయిస్టు అధికార ప్రతినిధి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: