ఆగస్టు 27న.. న్యూ రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ లాంచ్

ఆగస్టు 27న.. న్యూ రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ లాంచ్

ఆగస్టు 27న.. న్యూ రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ లాంచ్

కొత్త లుక్స్ తో  ఈ బైకు అందరినీ ఆకర్షిస్తుంది. 

ప్రపంచ వ్యాప్తంగా రాయల్ ఫీల్డ్ కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది..ఎన్ని కొత్త మోడళ్లు బైకులు, ఎలక్ట్రానిక్స్ బైకులు, కార్లు వచ్చినా బైకు ప్రియులు మాత్రం రాయల్ ఎన్ ఫీల్డ్ కోసం మాత్రం ఎగబడుతూనే ఉంటారు. ఇండియాలో లాంచ్ కాబోతున్న రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ బైకు సరికొంత్త హంగులతో మన ముందుకొచ్చింది చూద్దామా మరీ..

భారత్ లో సహా ప్రపంచదేశాల్లో రాయల్ ఫీల్డ్ కు ఓ లుక్ ఉంది.. సాధారణంగా  ఈ రాయల్ ఫీల్డ్ బైకును యువత డ్రీమ్ బైకుగా చెప్పుకుంటుంటారు. రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి ఇప్పటి వరకు ఎన్నో మోడల్స్ విడుదల అయినప్పటీకీ ఇంకా కొత్త దనాన్ని బైకు ప్రియులు కోరుకుంటూనే ఉంటారు. వీటిలో బుల్లెట్ క్లాసిక్ 350 మోడల్ కు మంచి ఆదరణ వస్తుందనే చెప్పాలి.

అయితే ఇండియాలో వేలాదిగా బుల్లెట్లు అమ్మకాలను సాధించాయి. బుల్లెట్ ప్రియుల కోసం కొత్త మోడల్ ను లాంఛ్ చేయబోతుంది. ఇదే క్లాసిక్ 350 మోడల్ అయితే ఆగస్టు 27న ఈ బైకును విడుదల చేయనుననట్లు ఆ సంస్థ తెలిపింది. కొత్త ఇంజన్, సరికొత్త టెక్నాలజీతో రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది.

ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ఫీచర్స్ : మెటల్ 350, 349 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్, 650 సీసీ ప్యార్లల్ ట్విన్ వెల్స్, ఈ ఇంజిన్ లో 20hp, 28 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైకులో బ్లూటూత్ కనెక్టివిటీతో పాటుగా ట్రిప్పర్ నావిగేషన్ ఫీచర్‌, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌కు కూడా అనుమతిస్తుంది. ఈ బైకులో 350 LCD హెడ్‌ల్యాంప్, సింగిల్-ఛానల్ ఏబీఎస్ తో ఉంది. ఈ బైకు డిజైన్ పరంగా అదే లుక్, కానీ ఫీచర్స్ లో మార్పులున్నాయి. మెరుగైన ఫినిషింగ్ అందించే అవకాశం ఉంది. కానీ చూపరులకు అప్పీల్ మాత్రం అలాగే ఉంటుంది. అయితే ప్రస్తుత క్లాసిక్​350 మోడల్‌తో పోలిస్తే న్యూ జనరేషన్ క్లాసిక్​350 ధర ఎక్కువగానే ఉంటుందని మార్కెట్​నిపుణులు అంచనా. అయితే దీని ధర సుమారు రూ .2 లక్షలు పైగా(ఎక్స్-షోరూమ్) లేదా అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది.

ఈ బైక్ ​ఇండియా మార్కెట్లో ఇప్పటికే ఉన్న క్లాసిక్ 350, హోండా H’Ness CB350, జావా సిరీస్​ బైక్​లకు గట్టి పోటీనివ్వనుంది. ఏదీ ఏమైనా ఎన్ ఫీల్డ్ కొనే వారికి ఓ గుడ్ న్యూస్ గానే చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *