మరోసారి వాయిదా పడిన ఆర్ఆర్ఆర్ మూవీ

మరోసారి వాయిదా పడిన ఆర్ఆర్ఆర్ మూవీ

మరోసారి వాయిదా పడిన ఆర్ఆర్ఆర్ మూవీ

‘ఆర్‌ఆర్‌ఆర్‌’రిలీజ్ కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నఫ్యాన్స్ కు మరోసారి నిరాశే ఎదురైంది.ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరిలో రిలీజ్‌ చేయాల్సి ఉండగా..కరోనా కారణంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఈ చిత్రం వాయిదా పడింది. తిరిగి ఈ మూవీనీ అక్టోబర్‌కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడైనా సినిమా విడుదలవుతుందా? లేదా? అనే సందేహంలో ఉన్న సినీ ప్రియులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆర్ఆర్ఆర్ మూవీ సినిమా విడుదలపై కొత్త న్యూస్ మరోసారి తెరకెక్కింది.. ఈ సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ఒక ట్వీట్‌ చేసింది. ‘అక్టోబర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ విడుదల చేసేందుకు పోస్ట్‌ ప్రొడెక్షన్‌ చాలా వరకూ పూర్తయింది.. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల వాయిదా వేస్తున్నాం అని తెలిపారు.ఇది ముందుగానే అందరూ ఊహించిందే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లు ఇంకా పూర్తిగా తెరుచుకోని నేపథ్యంలో కొత్త విడుదల తేదీని ప్రకటించలేకపోతున్నామని చిత్రయూనిట్ తెలిపింది.థియేటర్లు ప్రారంభం కాగానే తప్పకుండా సినిమా విడుదల చేస్తాం.. అని ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందం వెల్లడించింది.

రాజ్ మౌళీ డైరెక్షన్ లో వస్తోన్న ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే..రామ్ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్‌ కొమురంభీమ్‌గా కనిపించనున్నారు. దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో హీరోయిన్లు ఆలియాభట్‌, శ్రీయ, అజయ్‌దేవ్‌గణ్‌, ఒలీవియా మోరీస్‌, సముద్రఖని కీలకపాత్రల్లో సందడి చేయనున్నారు. అభిమానుల్లో కొంత ఉత్కంట నెలకొంది. ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *