‘RRR’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే…!

‘RRR’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే…!
  • దోస్తీ, దోస్తీ అంటున్న చెర్రీ, తారక్
  • ‘RRR’ అక్టోబర్ 13న రిలీజ్
  • రౌద్రం, రణం, రుధీరం అంటున్న చెర్రీ, తారక్

దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న తెలుగు చిత్రం   “ ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించారు.

రాజ్ మౌళీ కెరీయర్ లోనే కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంతో కొన్ని ప్రదేశాల్లో షూటింగ్ తీసే వీలులేక క్యాన్సిల్ చేసుకున్నారని వార్తలొచ్చాయి. దాదాపు తెలుగు రాష్ట్రాల్లోనే చిత్రీకరించినట్లు ఆధారాలు చెబుతున్నాయి. చిత్రంలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో 50 రోజుల పాటు విశ్రాంతి లేకుండా షూటింగ్  తీసినట్లు చెబుతున్నారు. ఆఖరి సన్నివేశాలను ఉక్రెయిన్‌లో పూర్తి చేయనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది.

చరిత్ర గురించి చెప్పే విధంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌, కొమురం భీంగా ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. హీరోయిన్లుగా ఆలియా భట్‌, ఒలివియా మోరిస్‌ నటిస్తున్నారు. ముఖ్య పాత్రలో అజయ్‌ దేవ్‌గన్, శ్రీయ కూడా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య బ్యానర్ పై రాజమౌళి డైరక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కు పలుమార్లు వాయిదా పడింది. అయితే ఈసారి ఈ సినిమాను అక్టోబర్ 13న అభిమానుల ముందుకు రాబోతుందని చిత్రయూనిట్ చెప్పింది.

ఫ్రెండ్ షిప్ డే రోజు ఇరగదీసిన సాంగ్

“దోస్తీ” సాంగ్ యూట్యూబ్ లో హల్ ఛల్ చేస్తోంది. అభిమానులంతా ఆ సాంగ్ ను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సాంగ్ క్రియేటింగ్ నా కొడుకు కార్తీకేయదే అని ఎం.ఎం.కీరవాణీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

దోస్తీ పై రాజమౌళి కామెంట్

దోస్తీ సాంగ్ కోసం కష్టపడ్డ క్రిడిట్ అంతా వాళ్లదేనని రాజమౌళి ప్రశంసల వెల్లువ కురింపించారు. ఈ చిత్రంలో రెండు సాంగ్స్ ఎంతగానో అభిమానుల గుండెల్లో హత్తుకు పోయేలా చేశాయని అన్నారు. ఫోటో గ్రాఫర్ దినేశ్ దోస్తీ, కొరియోగ్రాఫర్ సతీశ్ కృష్ణన్ వీడియోకు అందం తెచ్చారు. ఒక్కో భాష నుంచి ఒక్కో సింగర్ ఆలపించిన సాంగ్ ను ఇంత విజయం సాధిస్తుందని, ఔట్ పుట్ చూశాకా నాకు చాలా ఆనందంగా ఉందని ఇంత స్పందన వస్తుందని నేను ఊహించ లేదు.

మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, ఈ సినిమాకు పాట రాసిన సిరివెన్నెల సీతారామశాస్రికే ఈ క్రెడిట్ దక్కుతుందని రాజమౌళి అన్నారు. తెలుగు పాటకి సిరివెన్నెల సీతారామ శాస్త్రి అందించారు. హిందీలో మ్యూజిక్ డైరెక్టర్ గా అమిత్ త్రివేదీ, ఈ సినిమాలో ఫ్రెండ్ షిప్ డే సాక్ష్యంగా నిలిచే పాట ఉంటుందని, రామరాజు, భీమ్ ఇద్దరు హోరాహోరీగా పోటీ పడే విధంగా ఉంటుందని రాజమౌళి ట్వీట్ చేశారు.

ఈ పాటను రాసిన రచయితలు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో మదన్, రియా ముఖర్జీ, గోపాల కృష్ణన్, ఆజాద్ రాజ్ మౌళీ విషేష్ చెప్పారు. సాంగ్ షూటింగ్ లో పాల్గొన్న హేమచంద్ర, విజయ్ యేసుదాసు, అమిత్ త్రివేది, అనిరుధ్, యాజిన్ నైజర్ కి ఆల్ ది బెస్ట్ అని మౌళి ట్వీట్ చేశారు.

ఉక్రెయిన్ లోనే ఫినీషింగ్ టచ్

అయితే ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ ఉక్రెయిన్ లో ఎన్టీఆర్, రాంచరణ్ పై 1920 లో బ్రిటిష్ వారితో జరిగే సన్నివేశాలను ట్వీట్ చేశారు. కరోనా వైరస్ ప్రభావంతో ఆర్ఆర్ఆర్ పలుసార్లు వాయిదా పడిందని చెప్పొచ్చు. ఏదీ ఏమైనా అక్టోబర్ 13న రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే దసరాకు RRR సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *