RRR Movie: అక్టోబ‌ర్ 29న బీ రెడీ అంటూ ట్వీట్..!

RRR Movie: అక్టోబ‌ర్ 29న బీ రెడీ అంటూ ట్వీట్..!

ఆర్ఆర్ఆర్ మూవీ కోసం సినీ ప్రేక్షకులు, నెటిజన్లు ఎప్పుడా ఎప్పడా అని చాలా ఆశగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.. కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ డేట్లు పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్ (Ram Charan), అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా  రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.  అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామ‌రాజుగా మెగాపవర్‌ స్టార్‌.. కొమరం భీమ్‌గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఒలివియా మోరిస్, ఆలియా భట్‌ కథానాయికలుగా నటిస్తున్నారు.

అయితే ఆర్ఆర్ఆర్ నుంచి ఇప్పటికే విడుదలైన అల్లూరి, భీమ్‌ ఇంట్రడక్షన్‌ వీడియోలు రిలీజై మంచి రెస్పాన్స్‌ అందుకున్నాయి. కాగా ఈ మూవీ టీం సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ చిత్రం కోసం అక్టోబర్‌ 29 వరకు వేచి చూడాలని తెలిపింది.

ట్విటర్‌లో ఆర్ఆర్ఆర్ టీం పెట్టిన పోస్ట్ లో.. ‘ఇది వ‌ర‌కెన్న‌డూ చూడ‌ని, విన‌ని, ప్రపంచంలోనే ఇంతవరకు ఏ సినిమాకు లేని క‌ల‌యికను చూసేందుకు సిద్ధం అవ్వండంటూ.. ఇలాంటిది విషయం తొలిసారి కానుంది. ఇదే రోజు ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ఎక్జ‌యిటింగ్ న్యూస్‌ మీకోసం ఎదురు చూస్తోంది’ అని తెలిపింది. ఆ సర్‌ప్రైజ్‌ గురించి తెలుసుకోవాలి అంటే మరో రెండు రోజు వెయిట్‌ చేయక తప్పదు.

కాగా, ఈ సినిమా ఫైనల్‌గా 3 గంటల 15 నిమిషాలు వచ్చిందని సమాచారం. చివరిగా రాజ్ మౌళి ఈ సినిమాను ట్రిమ్ చేసి  చివరిగా 2 గంటల 45 నిమిషాలకు అన్ని భాషల్లో ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇదే ఫైనల్‌ అని కూడా చెబుతున్నారట. అంతేకాదు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను దుబాయ్‌లో నిర్వహించాలనే ప్లాన్‌లో ఉన్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది. జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుద‌ల చేస్తున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ డబ్బింగ్ పనులను ఎన్టీఆర్, రామ్  చరణ్‌ పూర్తి చేశారట. ఎన్టీఆర్.. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను ఎన్టీఆర్ పూర్తి చేయగా రామ్ చరణ్… తెలుగు, హిందీ, తమిళంలో… తన క్యారెక్టర్‌కు తానే డబ్బింగ్ చెప్పినట్టు సమాచారం. కాగా ఈ చిత్రంలో తన పాత్రలో అజయ్ దేవ్‌గణ్, నటి ఆలియాతో పాటు మిగతా నటీనటులు ఈ సినిమా డబ్బింగ్ పనులు పూర్తి చేసేశారట. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూడాల్సిందే మరీ…

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: