RRR నుంచి మరో ట్రైలర్.. ముహూర్తం ఎప్పుడంటే..?

RRR నుంచి మరో ట్రైలర్.. ముహూర్తం ఎప్పుడంటే..?

రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రియ ఆయనకు జోడిగా కనిపించనుంది.

ఈ మూవీ అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో అల్లూరి సీతారామ‌రాజుగా మెగాపవర్‌ స్టార్‌.. కొమరం భీమ్‌గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇంగ్లీష్ నటి ఒలివియా మోరిస్, హిందీ నటి ఆలియా భట్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌కు ముహూర్తం ఖరారైంది.

తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ట్రైలర్‌ను డిసెంబర్ 3న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ డేట్‌లో ఏ సమయంలో ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాపై తెలుగు ఇండస్ట్రీలోనే కాదు హోల్ భారతీయ చిత్ర పరిశ్రమ వెయిట్ చేస్తోంది.

ఆర్ ఆర్ ఆర్ మూడు గంటల ఆరు నిమిషాలు ఉందని చెబుతున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు (Rated U/A) U/A సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుస్తోంది.

RRR ప్రమోషన్స్ కూడా జోరుగా జరుగుతున్నాయి. జనవరి 7, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ చిత్రం. అన్ని భాషల్లో ఒకేరోజు విడుదల కానుంది RRR.

ఇక ఈ సినిమా నుంచి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో విడుదలైన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. సిరివెన్నెల సీతరామశాస్త్రీ రాసిన ఈ పాటను హేమచంద్ర తన గాత్రంతో అదరగొట్టారు.

ఇప్పటికే విడుదలైన ఈ మూవీలోని ‘ నాటు.. నాటు’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట అన్ని భాషల్లో కలిపి దాదాపు 75 మిలియన్ వ్యూస్ ను అభిమానులు సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఈ పాట సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాటను చంద్రబోస్ రాశారు. ఈ చిత్రానికి కీరవాణి అద్భుతమైన సంగీతం అందించగా.. ప్రేమ్ రక్షిత్ అదిరిపోయే రీతిలో నృత్య రీతులు తనదైన శైలిలో సమకూర్చారు.

ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ RRR మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

బాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న అలియా భట్.. బాలీవుడ్ లో దాదాపు 9 కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటుందట.. ఇలాంటి సమయంలో తెలుగు ఇండస్ట్రీలో ఆమె పారితోషికం దాదాపు రూ.5కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో ఆలియా భట్ పాత్రకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంది.

ఈ RRR మూవీని నార్త్‌ ఇండియన్‌ థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ ను ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారీ మొత్తంలో కొనుగోలు చేసుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ ఇంకా డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *