సంక్రాతికీ కూడా RRR రిలీజ్ డౌట్.. ఉగాదికి వస్తోంది RRR

సంక్రాతికీ కూడా RRR రిలీజ్ డౌట్.. ఉగాదికి వస్తోంది RRR

సంక్రాతికీ కూడా RRR రిలీజ్ డౌట్.. ఉగాదికి వస్తోంది RRR   

డైరెక్టర్ రాజ్ మౌళి డైరెక్షన్ లో రాబోతున్న సినిమా ఆర్ఆర్ఆర్ సినిమాపై ఏవైనా రూమర్స్ వస్తే చాలు క్షణాల్లో సోషల్ మీడియాలో వార్తలు హల్ ఛల్ చేస్తున్నాయి.అయితే పాన్ ఇండియా మూవీలో టాలీవుడ్ స్టార్స్ రామ్, తారక్ నట్టిస్తున్న సంగతి అందిరకీ తెలిసిందే..అయితే ఈ సినిమా రిలీజ్ పై ప్రేక్షకులు, అభిమానులు ఏప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.

అయితే ఈసినిమా కరోనాతో పలుమార్లు వాయిదా పడుతూనే ఉంది. ఈ చిత్రం విడుదలపై ఎంతో ఆసక్తిగా ఉన్న అభిమానులు, ప్రేక్షకులకు తెరపడినట్లైంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తీసిన చిత్రం ప్రేక్షకులు, అభిమానులు ఉహించని అంచనాలకు అందదని సమాచారం. ఈ చిత్రంలో కొమరంభీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ పాత్రలు ఎంతో ప్రేక్షుకుల్ని, అభిమానుల్ని ఎంతో అలరిస్తున్నాయి. ఈ చిత్రంలోని మిగిలిన సన్నివేశాలను ఇటీవలే ఉక్రెయిన్లో పూర్తి చేసుకొని హైదరాబాద్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈసినిమాను గతంలో అక్టోబర్ లో విడుదల చేయాలని చిత్రయూనిట్ భావించింది. దీనిపై అధికారిక ప్రకటన కూడా చేశారు. కానీ కరోనా తరువాత మళ్లీ సెకండ్ వేవ్, డెల్టా వేరియంట్ల ప్రభావం చిత్రయూనిట్ పై పడింది. దీని కారణంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది. డైరెక్టర్ రాజ్ మౌళీ సంక్రాతికైనా ఆర్ఆర్ఆర్ ని రిలీజ్ చేద్దామని అనుకున్నప్పటీ.. సంక్రాంతి బరిలో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. కానీ అదే సమయంలో ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల మిగతా సినిమాలకు ఇబ్బంది కలగకూడదనే అభిప్రాయంతో ఈ సినిమాను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

అయితే సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చేసారు రాజ్ మౌళీ. అయితే 2022, జనవరి ఉగాదికల్లా రిలీజ్ చేయాలని నిర్ణయించామని తెలిపారు డైరెక్టర్ రాజ్ మౌళీ, అయితే ఈ సినిమాలో ఆలియాభట్, అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించనున్నారు.

దీనిపై అధికారిక ప్రకటన త్వరలో రిలీజ్ చేస్తారని చిత్రయూనిట్ అంటోంది. ఏదీ ఏమైనా అభిమానులు, ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ పై ఓ నమ్మకము అనేది భారీ అంచనాల మధ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ ఉత్కంఠకు తెరపడేదెప్పుడోనని అనుకుంటున్నారు.

అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ థీమ్ సాంగ్ దోస్తీకి అన్ని భాషల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *