ఇకపై RTO ఆఫీసులకు వెళ్లకుండానే లైసెన్స్

గుడ్ న్యూస్ చెప్పిన RTO
ఇకపై RTO ఆఫీసులకు వెళ్లకుండానే లైసెన్స్
దేశ వ్యాప్తంగా వాహన దారులకు ఓ గుడ్ న్యూస్.. ఆర్టీఓ ఆఫీస్ కు వెళ్లకుండా డ్రైవింగ్ లైసెన్స్ పొందే సౌకర్యాలను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకొచ్చాయి. వైకిల్స్ సంఘాలు, ఎన్జీవో గుర్తింపు ఉన్న డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులు ఇస్తున్నట్లు కేంద్ర రోడ్డు, రవాణా రహదారుల మంత్రిత్వశాఖ తెలిపింది.
అంతే కాకుండా డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న వ్యక్తులు లైసెన్సులు కూడా జారీ చేయొచ్చునని ఓ ప్రకటనలో తెలిపింది. అర్హత ఉన్న డ్రైవింగ్ సంస్థలు డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసేందుకు అనుమతుల కోసం ఆర్టీఓ కు అప్లై చేసుకోవాలని కేంద్రం సూచించింది. అయితే మీ ద్వారా అందిచింన సేవలన్నీంటిని ఓ నివేదిక రూపంలో ప్రతి ఏడాది ఆర్టీఓ లేదా టీటీవో ఆఫీసులకు సమర్పించాలని కేంద్ర రోడ్డు, రవాణా రహదారుల మంత్రిత్వశాఖ తెలిపింది.