నిలకడగానే సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం: వైద్యులు

నిలకడగానే సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం: వైద్యులు

నిలకడగానే సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం: వైద్యులు

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మెగాస్టార్ మేనల్లుడు సినీ నటుడు సాయిధరమ్ తేజ్ గాయపడ్డారు. తేజ్ బైక్ పైనుంచి పడిన సమయంలో కుడి కంటిపై భాగంలో, ఛాతి పై భాగంలో బాగా దెబ్బలు తగిలాయి. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని  డాక్టర్లు తెలిపారు.జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన అపోలో వైద్యులు.. తేజ్ కి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. కాలర్ బోన్ విరిగిందని..అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన  అవసరం లేదన్నారు. ప్రస్తుతం తేజ్ కి వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోందని..మరో 48 గంటలు డాక్టర్లు పర్యవేక్షించాలన్నారు. అంతర్గతంగా ఎలాంటి ప్రమాదం ఏమీ లేదని..ఆర్గాన్స్ కూడా బాగానే ఉన్నాయిని అపోలో వైద్యులు తెలిపారు.

శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో సైబరాబాద్ కమిషనరేట్ ఐకియా స్టోర్స్ దగ్గరలోని కేబుల్ బ్రిడ్జిపై వెళ్తున్న సాయిధర్మమ్ తేజ్.. ఒక్కసారిగా స్పోర్ట్స్ బైక్ స్కిడ్ అయి కిందపడటంతో తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఘటనపై పోలీసులు యాక్సిడెంట్ కు సంబంధించిన సీసీటీవీ పుటేజ్ ను రిలీజ్ చేశారు. అయితే ఆ పుటేజ్ లో ఉన్న దృశ్యాల ఆధారంగా… మాదాపూర్ రోడ్డుపై  బైక్ పై స్పీడ్ గా వస్తున్న సాయిధరమ్ తేజ్ తన ముందున్న బైక్, ఆటోను ఓవర్ టేక్ చేయబోయి స్కిడ్ అయి కింద పడ్డాడు. రోడ్డుపై పడిన సాయిధరమ్ తేజ్ కొంత దూరం వరకు బైకుతో పాటుగా లాక్కెళ్లిన దృశ్యాలు సీసీపుటేజ్ లో రికార్డు అయ్యాయి. దీని ప్రకారం చూస్తే ఆ సమయంలో సాయిధరమ్ తేజ్ ఛాతి, పొట్ట, కంటి భాగంలో గాయాలు అయ్యాయి. యాక్సిడెంట్ స్పాట్ లో సాయిధరమ్ తేజ్ స్పృహ కోల్పోయాడు.

ప్రమాద వివరాలను తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్ తో సహా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు అపోలో ఆస్పత్రికి వచ్చారు. తేజ్ కి ఏమైందోనన్న ఆందోళన అభిమానుల్లో నెలకొంది. ఆస్పత్రి దగ్గర కొంత ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. పోలీసులు  ఫ్యాన్స్ ని కంట్రోల్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *