నిలకడగా సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం..కొనసాగుతున్న చికిత్స

నిలకడగా సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం..కొనసాగుతున్న చికిత్స

నిలకడగా సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం..కొనసాగుతున్న చికిత్స

మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదంలో గాయలపాలైన సంగతి తెలిసిందే. సాయిధర్మ్ తేజ్ కు ఏమైందోనని సినీ ఫ్యాన్స్ కంగారు పడాల్సిన అవసరం లేదని.. అపోలో ఆస్పత్రిలో 4వ రోజు కూడా చికిత్స కొనసాగుతోంది. వైద్య పరీక్షల్లో తేజ్ కు కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయ్యిందని, శస్త్ర చికిత్స చేయాలనీ ప్రకటించిన విషయం తెలిసిందే. కాలర్ బోన్ ఫ్రాక్చర్ ఆపరేషన్ మల్టీడిసిప్లినరీ నిపుణుల బృందం విజయవంతంగా పూర్తి చేసింది. తరువాత అబ్జర్వేషన్‌లో ఉంచామని తెలిపిన వైద్యులు..ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆయన చికిత్సకు సహకరిస్తున్నారని వైద్యులు తెలిపారు.

చిరంజీవి , పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ , నిహారిక, మెగాస్టార్ సతీమణి సురేఖ ఇలా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆసుపత్రికి వెళ్లి తేజ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ఇప్పటికే సినీ ప్రముఖులు తేజ్ కుటుంబసభ్యులను పరామర్శిస్తున్నారు. పలువురు సోషల్ మీడియా వేదికగా తేజ్ త్వరగా కోలుకోవాలని సెలబ్రెటీలు కోరుకుంటున్నారు. ఫ్యాన్స్ కూడా ఉపవాసాలు ఉంటూ తేజ్ కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *