బాలికలను సైనిక్ స్కూల్ లో చేర్చించాలంటే..!
బాలికలను సైనిక్ స్కూల్ లో చేర్చించాలంటే..!
సైనిక్ స్కూల్ లో చేర్పించాలనుకునే వారు అవకాశం కల్పించింది. 6వ తరగతి, 9వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. ఈ అడ్మిషన్లు 2022-23 అకడమిక్ సెషన్ కోసం కల్పిస్తున్నారు.
దరఖాస్తు చివరి తేదీ: అక్టోబర్ 26, 2021 (సాయంత్రం 5 గంటల వరకు)
దరఖాస్తు ఫీజు ఎలా అప్లై చేయాలి: అక్టోబర్ 26, 2021 రాత్రి 11.50 వరకు ఫారమ్ నింపి ఆన్లైన్లో సమర్పించాలి.
ఏ విధమైన కేటగిరిలు: జనరల్ కేటగిరీ, రక్షణ సిబ్బంది, మాజీ ఉద్యోగుల పిల్లలకు దరఖాస్తు రుసుము రూ.550. SC, ST వర్గాలకు రూ.400 కేటాయించారు.
అప్లికేషన్ రిజెక్ట్ ఎలా అవుతుంది: అభ్యర్థి ఒక దరఖాస్తు ఫారమ్‌ను మాత్రమే అప్లై చేయాలి. ఒకటి కంటే ఎక్కువ ఫారమ్‌లను నింపినట్లయితే వారి దరఖాస్తు తిరస్కరిస్తారు. నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా ఫారమ్‌ను నింపాలి. ఫోటో సైజ్, ఫార్మాట్, సర్టిఫికేట్లు, లోకల్, నాన్ లోకల్, కుల ధృవీకరణ సర్టిఫికెట్ తో సహా పలు పత్రాలు అవసరమవుతాయి.
సైనిక్ స్కూల్ అడ్మిషన్ అర్హత: 6వ తరగతి అడ్మిషన్ కోసం దరఖాస్తు చేస్తున్నట్లయితే అభ్యర్థి వయస్సు (సైనిక్ స్కూల్ క్లాస్ 6 వయోపరిమితి) 31 మార్చి 2021 నాటికి 10 నుంచి 12 సంవత్సరాల మధ్య ఉండాలి.
9 అడ్మిషన్ కోసం దరఖాస్తు చేస్తున్నట్లయితే అభ్యర్థి వయస్సు 31 మార్చి 2022 నాటికి 13 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉండాలి (సైనిక్ స్కూల్ క్లాస్ 9 వయోపరిమితి). ప్రవేశ సమయంలో విద్యార్థి 8 వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
ప్రవేశ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు: సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష 09 జనవరి 2022న నిర్వహిస్తారు. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటే AISSEE 2021. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది.