సలార్ లో రాజమనార్ పాత్రలో ఎవరంటే..

సలార్ లో రాజమనార్ పాత్రలో ఎవరంటే..
పాన్ ఇండియా కథనాలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న పాన్ స్టార్ ప్రభాస్. డైరెక్టర్ ప్రశాంత్ నీలి డైరెక్షన్ తెరకెక్కనున్న చిత్రం “ సలార్” చిత్రం అతి మీకు గతంలో తెలిసిన విషయమే. దీనిలో భాగంగా ‘సలార్’ నుంచి ఓ స్పెషల్ అప్డేట్ని ట్విట్టర్ వేదికగా చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ఈ చిత్రంలో రాజమనార్ పాత్రలో కనిపించనున్న జగపతిబాబు పిక్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో జగపతిబాబు ముక్కుకు రింగు, కోపం నిండిన చూపులతో ఫుల్ సీరియస్ లుక్‌లో దర్శనమిచ్చి.. ప్రేక్షకుల హృదయాల్లో జగపతిబాబు మరోసారిగా విలన్ పాత్రలో నటిస్తున్నారనే సంకేతాలిస్తోన్నాయి.
ఈ చిత్రం భారీ అంచనాల మధ్య తెరకెక్కనుంది. ఈ చిత్రంలో ప్రభాస్ వైల్డ్, సీరియస్ లుక్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో రెబల్ స్టార్ తో హీరోయిన్ శ్రుతిహాసన్ సండి చేయబోతుంది. ఈ చిత్రంలో శ్రుతి ఓ కీలకపాత్రలో కనిపించనున్నారని సమాచారం. అయితే ఈ సినిమాషూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రాన్ని హంబులే ఫిల్మ్స్ బ్యానర్‌పై సలార్ చిత్రం రాబోతుంది. ‘సాహో’ తర్వాత పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్న సంగతి అందరికీ తెలిసిందే.