అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది వేతనాలు పెంపు

అంగన్వాడీ టీచర్లు, సహాయ సిబ్బంది వేతనాలు పెంపు
ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న అంగన్ వాడి టీచర్లుకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు, సహాయ సిబ్బంది వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల 30 శాతం పీఆర్సీపీ (PRC) పెంచిన క్రమంలో వీరికి కూడా వేతన పెంపును వర్తింపచేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. పెంచిన జీతంతో అంగన్వాడీ టీచర్ల వేతనం గతంలో రూ.10,500 వేతనం ఉండగా.. పెంచిన జీతం ప్రకారం రూ.13,650కి పెరగగా.. మినీ అంగన్వాడీ టీచర్ల వేతనం రూ.6వేలు నుంచి పెరిగిన జీతంతో రూ.7,800 లకు పెరగనుంది. అంగన్వాడీ ఆయాలకు రూ.6వేలు వేతనం ఉండగా పెరిగిన వేతనంతో రూ.7,800 వరకు వస్తోంది. అయితే ఈ పెంచిన జీతాలు జులై నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. వెంటనే ఆయా శాఖలకు ఆదేశాలు పంపాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.