ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా సమంత సంపాదన ఎంతో తెలుసా..?

ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా సమంత సంపాదన ఎంతో తెలుసా..?
తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న నటి సమంత అక్కినేని..సమంత అక్కినేని తెలుగులో ‘ఏమాయ చేశావే’ సినిమాతో పరిచయమైంది. తన అందచందాలతో కుర్రకారుని మాయలో పడేసిన తమిళ పొన్ను. నాగ చైతన్యను మాయ చేసి.. సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైంది. సమంత ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్గా వెలుగుతోంది.
అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో వాణిజ్య పోస్టులు పెట్టి తన అంద చందాల ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తోంది. ఓ వైపు సినిమాలు, మరో వాణిజ్య ప్రకటనలతో అదరగొడుతోంది. ఈ వాణిజ్య ప్రకటనల ద్వారా సమంత దాదాపు 20 నుండి 30 లక్షల వరకు వసూలు చేస్తోందని సమాచారం. సమంతకు సోషల్ మీడియాలో అభిమానుల ఫాలోవర్స్ బాగా ఉంది. అయితే ప్రస్తుతం ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 18 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
ప్రస్తుతం సమంత `కవాతుల రెండు కాదల్ ` అనే తమిళ సినిమాతో పాటు తెలుగులో శాకుంతలం అనే పౌరాణిక చిత్రంలో నటిస్తుంది.