కోర్టులో సమంత కేసు విచారణ ఎలా జరిగిందంటే..?

కోర్టులో సమంత కేసు విచారణ ఎలా జరిగిందంటే..?
సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తున్న న్యూస్ చైతూ-సమంత విడాకుల విషయంలో ఆ మూడు యూట్యూబ్ ఛానళ్లపై కూకట్ పల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే..అయితే ఈ కేసు విచారణ ఈరోజు చేపట్టారు. సమంత- చైతూల చైతన్యల మధ్య వివాదం జరగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.
చైతూతో విడాకుల తరువాత ఫస్ట్ టైమ్ కూకట్ పల్లి కోర్టుకు సామ్ వెళ్లింది. అయితే సామ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. అదేంటంటే.. మేం విడిపోయాం..మా ప్రైవేసీకి భంగం కలిగించొద్దు. లేనిపోని రూమర్లు సృష్టించొద్దు అంటూ.. సామ్, చైతూ విడిపోతూ సోషల్ మీడియా వేదిక పెట్టిన పోస్టు ఇది.. కానీ దీనిని ఊహించి కొన్ని యూట్యూబ్ ఛానళ్లు సమంతపై తప్పుడు కథనాలు రూపొందించారు.
దీంతో చైతూ డైవోర్స్ ఇచ్చేశాడంటూ సమంతపై సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లలో తప్పుడు ప్రచారం జరిగింది. ఆమె ప్రతిష్ట, పరువుకు భంగం కలింగేలా ప్రవర్తించారని, సమంత తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. వాదనలు విన్న కూకట్ పల్లి కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమంత-చైతూల విడాకులపై తప్పు జరిగిందని భావిస్తే.. పరువు నష్టం దాఖలు చేసే బదులు ఆ యూట్యూబ్ ఛానళ్ల వ్యక్తుల నుండి క్షమాపణలు కోరవచ్చుకదా అని ప్రశ్నించిన కోర్టు.
అయితే ఈ సందర్భంగా సదరు కోర్టు పబ్లిక్ డొమైన్ లో సెలబ్రిటీలు వారి వ్యక్తిగత వివరాలను వాళ్లే పెడుతున్నారని, పరువుకు భంగం కలిగింది అని వారే అంటున్నారని సదరు కోర్టు పేర్కొన్నది. కాగా, ఈ కేసులో వాదనలు ముగియడంతో తీర్పును రేపటికి వాయిదా వేసింది కూకట్పల్లి కోర్టు.