కూకట్‌పల్లి కోర్టులో సమంత పిటిషన్ పై ఏం జరిగిందో తెలుసా..?

కూకట్‌పల్లి కోర్టులో సమంతకు భారీ ఊరట లభించింది. తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, సమంత వ్యక్తిగత వివరాలను కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ప్రసారం చేయడం, నా ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహారించొద్దని అలా కంటెంట్‌ని తొలగించాలని పరువునష్టం దావా వేసిన సంగతి అందరికి తేలిసిందే. ఆమె వ్యక్తిగత విషయాలపై సోషల్‌ మీడియాలో పెట్టిన కామెంట్స్ ని కూడా తొలగించాలని కోరింది.

సోషల్‌ మీడియాలో తన పరువుకు నష్టం కలిగించేలా దుష్ప్రచారం చేశారంటూ సమంత దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం కూకట్‌పల్లి కోర్టు విచారించింది. సమంత ప్రతిష్టకు నష్టం కలిగించేలా వ్యవహరించిన రెండు యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులు, డాక్టర్ సీఎల్ వెంకట్ రావు ప్రసారాలు చేసిన యూట్యూబ్ లింకులను వెంటనే తొలగించాలని కూకట్ పల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కాగా సోషల్‌ మీడియాలో నేను విడాకులు తీసుకోకముందే..నా పరువుకు నష్టం కలిగించేలా దుష్ప్రచారం చేశారంటూ.. సమంత తరఫు న్యాయవాది కూకట్ పల్లి బాలాజీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. వ్యక్తిగత వివరాలపై లేనిపోని అపోహలు సృష్టించి నాపై  దుష్ప్రచారం చేస్తున్నారంటూ సమంత పిటిషన్‌లో పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *