సమంత విడాకులపై తండ్రి ఏమన్నారో తెలుసా..?

సమంత విడాకులపై తండ్రి ఏమన్నారో తెలుసా..?

టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా సమంత, చైతూల విడాకులపై ఏ న్యూస్ వచ్చినా నెటిజన్లు, ప్రేక్షుకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ అని సినిమాతో పాటుగా పేరు తెచ్చుకున్న మూడ్డాళ్లకే.. నాగ చైతన్య, సమంత తమ విడాకుల విషయమై సోషల్ మీడియాలో స్టేట్‌మెంట్‌లను పోస్ట్ చేసి అధికారికంగా ప్రకటించిన విషయం అందరినీ సమస్త ప్రజానికాన్ని నిరుత్సాహపరిచింది. విడాకుల విషయంపై అక్కినేని అభిమానులు, సమంత ఫ్యామిలీతో పాటుగా సినీ ప్రియులందరికీ భారీ షాక్ తగిలింది. సోషల్ మీడియా వేదికగా చైతూ, సాము ప్రకటించారో లేదో విడాకులకు అసలు కారణం ఏంటి ? అనే విషయంపై ఆరాలు తీయడం మొదలు పెట్టారు. మరికొంత మంది ఒకడుగు ముందుకేసి సామ్ డివోర్స్ కు కారణం ఆ సినిమానే అని, మరికొందరు సామ్ కు దగ్గరగా ఉండే ఆ వ్యక్తి వలనే డివోర్స్ అంటూ కథనాలతో పాటుగా సినీ ప్రముఖులు కూడా అభిప్రాయాలు వ్యక్తం చేశారని నెటిజన్లు అంటూ పోస్టులు పెట్టడం జరిగింది. అయితే అసలు కారణం ఏంటి అనే విషయం సామ్, చైతూ ఇద్దరూ బయట పెట్టలేదు. విడాకులపై సమంత తండ్రి జోసెఫ్ ప్రభు తన కుమార్తె, అల్లుడు చైతూ విడిపోవడంపై స్పందించారు.

సమంత తల్లితండ్రులు ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉంటారు. విడాకులపై తన తండ్రి ఆవేదన వెల్లబుచ్చాడు. విడాకుల వార్త విన్నప్పటి నుండి తన మనస్సు శూన్యం అయిపోయిందని తండ్రి అన్నారు. త్వరలోనే తన కూతురు పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నట్లు తండ్రి జోసెఫ్ ప్రభు అభిప్రాయం వెల్లడించారు. విడాకులపై తన కూతురి నిర్ణయం తనకు షాక్ ఇచ్చినప్పటికీ.. సమంత ఆలోచనలను గౌరవించానని ఆయన అన్నారు. మరోవైపు సమంత అభిమానులు కూడా ఈ సమయంలో సామ్ కు సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. 2017 లో నాగ చైతన్య, సమంత గోవాలో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి సమస్త ప్రజానికానికి తెలిసిందే.

సోషల్ మీడియా వేదికగా విడాకుల విషయం ప్రకటించిన తరువాత నాగ చైతన్య తన సినీ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు. గచ్చిబౌలిలోని తన సొంత ఇంట్లో సమంత ఉంటోంది. తను కూడా ఇటీవల కొత్త సినీ ప్రాజెక్టులపై సంతకాలు చేసింది. ఆ ప్రాజెక్టులకు సంబంధించి త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తానని తను చెబుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *